India vs SA T20: టీమ్ ఇండియా వరుసగా రెండవ ఓటమి ఎదుర్కొంది. రెండవ టీ20లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్, భువనేశ్వర్ బౌలింగ్ కీలకంగా నిలిచాయి.
ఐపీఎల్ 2022 తరువాత జరుగుతున్న తొలి టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఘోరంగా విఫలమౌతోంది. కటక్‌లో జరుగుతున్న రెండవ టీ20 మ్యాచ్‌లో కూడా ఇండియా ఓటమి పాలైంది. డిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమితో ఇండియా గుణపాఠం నేర్చుకోలేదని తెలుస్తోంది. వరుసగా రెండవ మ్యాచ్‌లో వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకోవడంతో..టీమ్ ఇండియా బరిలో దిగింది. దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు టీమ్ ఇండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమ్ ఇండియా తరపున శ్రేయస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34, దినేష్ కార్తీక్ 30 పరుగులు మాత్రమే చేయగలిగారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంత కట్టడిగా ఉందంటే..14.2 ఓవర్ల నుంచి 18.3 ఓవర్ల వరకూ ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది ఇండియా. టీ20 చివరి ఓవర్లలో ఒక్క ఫోర్ కూడా రాకపోవడం విశేషమే. ఓ దశలో టీమ్ ఇండియా 17 ఓవర్లలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఆ తరువాత 149 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా..హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. వరుసగా రెండవ టీ20లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. క్లాసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పగులు చేశాడు. టీమ్ ఇండియా తరపున భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరగడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఓ దశలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఆ నాలుగు వికెట్లు భువనేశ్వర్ కుమార్ ఖాతాలోనివే కావడం విశేషం. దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలోనే 149 పరుగులు చేసింది. ఇండియాపై మరో విజయాన్ని నమోదు చేసింది.
Also read: IND vs SA 2nd T20I: టీమిండియాదే బ్యాటింగ్.. రెండు మార్పులతో బరిలోకి దక్షిణాఫ్రికా! ఉమ్రాన్‌కు నిరాశే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
India vs SA T20: టీమ్ ఇండియాపై 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం