India Vs New Zealand: కుప్పకూలిన న్యూజిలాండ్.. టీమిండియాకు ఈజీ టార్గెట్

New Zealand all out for 108 Runs: భారత బౌలర్ల దెబ్బకు రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. బుల్లెట్‌లా దూసుకువస్తున్న బంతులకు క్రీజ్‌లో నిలబడలేక.. పెవిలియన్ బాటపట్టారు. మహ్మద్ షమీ కివీస్ బ్యాట్స్‌మెన్ భరతం పట్టగా.. మిగిలిన బౌలర్లు చక్కగా సహకరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 04:51 PM IST
India Vs New Zealand: కుప్పకూలిన న్యూజిలాండ్.. టీమిండియాకు ఈజీ టార్గెట్

New Zealand all out for 108 Runs: రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూల్చారు. కివీస్‌ తరఫున గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. మైకేల్ బ్రేస్‌వెల్ 22, మిచెల్ సాంట్నర్ 27 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. భారత్ తరఫున మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు, సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఈ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

 

ఈ మ్యాచ్‌లో టాస్ సమయంలో రోహిత్ శర్మ మతిమరుపు నవ్వులు తెప్పించింది. టాస్ గెలిచిన తరువాత ఏం తీసుకోవాలో మర్చిపోయాడు. కాసేపు ఆలోచించి.. ఫీల్డింగ్ అని చెప్పాడు. దీంతో కివీస్ మొదట బ్యాటింగ్ చేయగా.. ఆరంభం నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మహ్మద్ షమీ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. ఐదో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ (0)‌ను క్లీన్ బౌల్డ్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్ హెన్రీ నికోలస్ (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తరువాత వెంటనే డారెల్ మిచెల్ (1)ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. 

డేవిడ్ కాన్వే (7)ను హార్ధిక్ పాండ్యా అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టించాడు. ఆ తరువాత కెప్టెన్ లాథమ్ (1)ను శార్దుల్ ఠాకూర్ ఔట్ చేయడంతో 15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్‌లో గత మ్యాచ్‌ హీరో బ్రాస్‌వెల్, ఫిలిప్స్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.  

హైదరాబాద్ వన్డేలో న్యూజిలాండ్ 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో.. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి మెరుపు శతకం బాదిన బ్రాస్‌‌వెల్.. ఈ మ్యాచ్‌లోనూ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సమయంలో షమీ మరోసారి దెబ్బతీశాడు. క్రీజ్‌లో కుదురుకున్నట్లే కనిపించిన బ్రాస్‌వెల్ (30 బంతుల్లో 22)ను ఔట్ చేశాడు. 56 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును శాంట్నర్, ఫిలిప్స్ కలిసి వంద దాటించారు. వీరిద్దరి భాగసామ్యంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేస్తుందనిపించింది.

ఈ సమయంలో శాంట్నర్‌ (27) క్లీన్‌బౌల్డ్ చేసి హార్ధిక్ పాండ్యా బ్రేక్ ఇచ్చాడు. ఆ తరువాత ఫిలిప్స్ (36), ఫెర్గ్యూసన్ (1)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. టింక్నర్‌ (2)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపించడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. సంక్రాంతికి బస్సులకు మంచి ఆదరణ  

Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News