India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు

India vs Netherlands Preview: టీమిండియా నేడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఫామ్ కోల్పోయిన భారత టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఇదో మంచి అవకాశం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్‌ ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 10:32 AM IST
  • నెదర్లాండ్స్‌తో నేడు టీమిండియా పోరు
  • మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం
India vs Netherlands: మరి కాసేపట్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు.. వీళ్లపైనే అందరి కళ్లు

India vs Netherlands Preview: టీ20 వరల్డ్ కప్‌లో మరోపోరుకు భారత్ సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయం తరువాత నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సిడ్నీ వేదికగా రెండు జట్ల మధ్య మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పసికూనే కదా అని నెదర్లాండ్స్‌ను తక్కువ అంచనా వేస్తే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రం అలసత్వం వహించకుండా స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌దే విజయం. లోపాలను సరిదిద్దుకుని తరువాత మ్యాచ్‌లకు సిద్ధమయ్యేందుకు టీమిండియాకు ఇదో చక్కటి అవకాశం.  

భారత్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో లేకపోవడం సమస్యగా మారింది. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గురిపైనే అందరి కళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హిట్ మ్యాన్‌ బ్యాట్‌తో చెలరేగి ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఓపెనర్లు చెలరేగి ఆడితే.. మిగిలిన పని పూర్తి చేయడానికి విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా సిద్ధంగా ఉన్నారు. సూర్యకుమార్ ఊచకోత మొదలుపెడితే ఆపడం ఇక ఎవరి తరం కాదు. చివర్లో సూపర్ ఫినిషర్‌ దినేశ్ కార్తీక్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్ విభాగంలో ఎలాంటి సమస్యలు లేవు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బౌలర్లు ఆకట్టుకున్నారు.

పాక్‌తో ఆడిన జట్టే.. నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకోవాలని డిమాండ్స్‌ వస్తున్నా.. రోహిత్ శర్మ తుది జట్టును మార్చేందుకు ఇష్టపడకపోవచ్చు. సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుడంతో టాస్‌ గెలిస్తే రోహిత్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి.. భారీ స్కోర్ చేయాలని ఆలోచిస్తోంది.

ఇక నెదర్లాండ్స్‌ విషయానికి వస్తే.. పేరుకు పసికూనే అయినా బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. బంగ్లాతో ఆడిన తొలి మ్యాచ్‌లో 144 పరుగులకే కట్టడి చేశారు. పాల్ వాన్ మీకెరెన్, బాస్ డి లీడే బంగ్లాపై మంచి ప్రదర్శన చేశారు. బ్యాటింగ్‌లోనూ చివరి వరకు పోరాడి ఓడిపోయారు. చిన్న చిన్న తప్పులు చేయకపోతే నెదర్లాండ్స్‌ మ్యాచ్ గెలిచేదే.

బ్యాటింగ్‌లో నెదర్లాండ్స్‌కు సమస్యగా మారింది. చివరి మ్యాచ్‌లో కోలిన్ అకర్‌మాన్‌ 48 బంతుల్లో 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మ్యాక్స్ ఒడౌడ్, విక్రమ్ జీత్, టామ్ కూపర్, ఎడ్వర్డ్స్ వంటి బ్యాట్స్‌మెన్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశం లేకపోవడం సానుకూలాంశం. బ్యాటింగ్ పిచ్‌ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 

టీమిండియా తుది జట్టు (అంచనా):

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ (కెప్లెన్), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, అక్షర్ పటేల్/రిషబ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, రవిచంద్రన్ అశ్విన్. 

Also Read: Bandi Sanjay: ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా కొనరు.. టీఆర్ఎస్‌కు బండి సంజయ్ కౌంటర్  

Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News