Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ నేడే, పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇలా

Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 5 టెస్ట్‌ల సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై టీమ్ ఇండియాను ఇంగ్లండ్ ఎదుర్కోగలదా అనేది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం సాక్షిగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2024, 07:57 AM IST
Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ నేడే, పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇలా

Ind vs Eng Test: ఇండియా మరో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో స్వదేశంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇంగ్లండ్ జట్టు ఇండియాతో మొత్తం ఐదు టెస్ట్‌లు ఆడనుంది. మొదటి టెస్ట్ జరగనున్న ఉప్పల్ స్డేడియం పిచ్, వాతావరణం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

గతంలో రెండు సార్లు ఇండియా చేతిలో టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయిన ఇంగ్లండ్ ఈసారి ఏకంగా 5 టెస్ట్‌లకు సిద్ధమైంది. అటు ఇంగ్లండ్ ఈసారి బజ్ బాల్ అంటూ ఇండియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బలాబలాలు, గత రికార్డులు పరిశీలిస్తే ఇండియాదే పైచేయిగా ఆర్ధమౌతోంది. అయితే ఈసారి ఇండియా విరాట్ కోహ్లి లేకుండా బరిలో దిగుతోంది. దక్షిణాఫ్రికా కేప్ టౌన్‌లో ఆడిన జట్టు కాకుండా పూర్తిగా మార్పులుంటాయి. బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు రంగంలో దిగనున్నారు. అశ్విన్ రవిచంద్రన్-రవీంద్ర జడేజా కాంబినేషన్ స్పిన్ ఉంటుంది. మూడవ స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఇక పేసర్లుగా బూమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఉండనే ఉన్నారు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 23 టెస్ట్‌లు ఆడిన మొహమ్మద్ సిరాజ్‌కు సొంత గడ్డపై ఇదే మొదటి టెస్ట్,.

అటు ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టు ప్రకటించింది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక పేసర్‌తో రంగంలో దిగుతోంది. లీచ్, రేహాన్, టామ్ హార్లీలు స్పిన్నర్లుగా బరిలో దిగుతున్నారు. జో రూట్‌ అదనపు స్పిన్నర్‌గా ఉండవచ్చు. పేసర్ విభాగంలో మార్క్ వుడ్ ఒక్కడే అందుబాటులో ఉంటాడు. బ్యాటింగ్ అంతా రూట్, బెయిర్ స్టోపై ఆధారపడి ఉంటుంది. ఈ ఇద్దరూ కాకుండా ఓలీ పోప్, క్రాలీ, డకెట్‌లు ఉన్నారు. 

ఉప్పల్ పిచ్ పొడిగా ఉంది. కచ్చితంగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. అయితే స్పిన్‌కు టర్న్ అయ్యేందుకు ఎంత సమయం పడుతుందనేది చూడాలి. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఈ స్డేడియంలో భారత్ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ డ్రా అయితే తరువాత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌‌‌లపై టీమ్ ఇండియా విజయం సాధించింది. 

టీమ్ ఇండియా అంచనా

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, అశ్విన్ రవిచంద్రన్, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ జట్టు

జాక్ క్రాలీ, డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్లీ, జాక్ లీచ్

Also read: ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News