ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సుదీర్ఘ షెడ్యూల్‌లో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు తాజాగా టీ20ల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. నిర్ణయాత్మక చివరి టీ20లో విజయం సాధించింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్‌పై తప్పక నెగ్గాల్సిన టీ20లో తొలిసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓవరాల్‌గా టీ20ల్లో కోహ్లీ 9వ సారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలు, మరోవైపు సిరీస్ నెగ్గాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించి జట్టు విజయానికి బాటలు వేశారు.
Also Read: Chris Gayle Thanks India: భారత ప్రజలకు, PM Modiకి ధన్యవాదాలు తెలిపిన క్రిస్ గేల్
ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్ల లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. స్లో బంతులు వేసిన బంతులను బౌండరీలకు తరలించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టిన భువనేశ్వర్..
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టును టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే దెబ్బతీశాడు. తొలి ఓవర్ రెండో బంతికి జేసన్ రాయ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఆపై బట్లర్(52), డేవిడ్ మలాన్(68) పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులు చేశారు. శతక భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత భువీ బౌలింగ్‌లో బట్లర్ ఔటయ్యాడు.
ఆపై ఇంగ్లాండ్ జట్టు వరుస విరామాలలో వికెట్లు కోల్పోయింది. ప్రమాదకరంగా మారుతున్న మలాన్‌ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో జానీ బెయిర్‌స్టోను సైతం పెవిలియన్ బాట పట్టించి డబుల్ ధమాకా ఇచ్చాడు. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోతుండటంతో షాట్లకు ప్రయత్నించి ఇంగ్లాండ్ ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 188 పరుగులకు ఇంగ్లాండ్ పరిమితమైంది. తద్వారా భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భువనేశ్వర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది.
Also Read: India vs England ODI Series: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు Team Indiaను ప్రకటించిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook