Ind Vs Eng : మరో అసక్తికర పోరుకు భారత్-ఇంగ్లాండ్ సిద్దమయ్యాయి. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇంగ్లాండ్ కు గెలుపు తప్పనిసరి. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఆరంభమవుతోంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ స్టార్ట్ చేస్తారు.
రెండో టెస్టులో సాధించిన విజయంతో..రెట్టింపు ఉత్సాహంతో భారత్ (India) ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. భారత్ గతంలో ఒకే ఒక్కసారి ఇంగ్లాండ్(England) లో ఒకటి కన్నా ఎక్కువ టెస్టులు గెలిచింది. 1986లో కపిల్‌దేవ్(Kapil Dev) నేతృత్వంలోని జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ లో ఆధిక్యం సంపాంచాలనే పట్టుదలతో భారత్ ఉంది. అయితే భారత కీలక ఆటగాళ్లు కెప్టెన్ కోహ్లీ(Kohli), పూజారా(Pujara), రహానే(Rahane) ఫామ్ లో లేకపోవటం టీమిండియాను కలవరపెడుతున్న ఆంశం. పంత్ కూడా పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఓపెనర్లు రాహుల్, రోహిత్ ఫామ్ లో ఉండటం, జడేజా రాణిస్తుండటం సానుకూలాంశం. అయితే ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
Also Read: Virat Kohli : విరాట్ తాగే వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్(Joe Root) ఫామ్ లో ఉన్నా..మిగతా ఆటగాళ్ల నుంచి సరైనా సహకారం లభించకపోవటం ఆ జట్టును కలవరపెడుతోంది. బ్రాడ్, వుడ్ గాయపడంతో అతిథ్య జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది. ఇంగ్లాండ్(England)లో చాలా పిచ్‌లు పేస్ బౌలర్లకు అనుకూలిస్తాయి. కానీ ఇక్కడ పిచ్ పేసర్లకు మరీ ఎక్కువగా సహకరించకపోవచ్చని భావిస్తున్నారు. పిచ్‌పై పెద్దగా పచ్చిక లేదని భారత కెప్టెన్ కోహ్లి అన్నాడు. మ్యాచ్ జరిగిన అయిదు రోజులూ వాతావరణం(Weather) చాలా వరకు పొడిగానే ఉంటుంది. భారత్ చివరిసారి 2002లో ఇక్కడ ఆడినప్పుడు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook