India vs England 1st ODI: అరుదైన ఘనతకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

India vs England 1st ODI: నేడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 23, 2021, 11:32 AM IST
  • టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో
  • మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు తొలి వన్డే
  • మంగళవారం నాడు జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ శతకం బాదితే
India vs England 1st ODI: అరుదైన ఘనతకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

India vs England 1st ODI: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. మరో సెంచరీ సాధిస్తే కెప్టెన్‌గా అత్యదిక శతకాలు నమోదు చేసిన ఆటగాడికి విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. నేడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేకు వేదికగా మారింది.

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా 41 శతకాలతో ఉన్నారు. మంగళవారం నాడు జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ శతకం బాదితే, కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ పేరిట అరుదైన రికార్డు లిఖించుకోనున్నాడు. 

Also Read: Jofra Archer: వన్డే సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ, ఆందోళనలో రాజస్థాన్ రాయల్స్‌

మరోవైపు అదే శతకంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డును సమం చేయనున్నాడు. స్వదేశీ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన సచిన్ రికార్డును సమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు కోహ్లీ. భారత్‌లో సచిన్ వన్డేల్లో 20 శతకాలు నమోదు చేయగా, కోహ్లీ స్వదేశంలో మరో శతకం బాదితే సచిన్‌తో సంయుక్తంగా ఈ రికార్డును షేర్ చేసుకోనున్నాడు. 

ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో పాటు 231 పరుగులు సాధించాడు. టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లోనూ శతకాలు నమోదు చేసి పలు రికార్డులను కోహ్లీ బద్దలుకొడతాడని భారత క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Asghar Afghan T20I Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News