India VS Australia 3rd Test Highlights: ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆతిథ్య ఆసీస్ ఎంతగా యత్నించినా భారత జట్టును ఆలౌట్ చేయలేకపోయింది. అయితే చివరివరకూ ఎదురుచూసిన ఆసీస్ మరో ఓవర్ మిగిలుండగా డ్రాకు అంగీకరించడం గమనార్హం. భారత ఆటగాళ్లు సిడ్నీ టెస్టును డ్రా చేసుకున్నప్పటికీ, జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నా తమ పోరాట స్ఫూర్తితో నైతిక విజయం సాధించారు.
ఆతిథ్య ఆసీస్ జట్టు భారత్‌కు మొత్తం 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయినా ఏ మాత్రం తణుకుబెణుకు లేకుండా టీమిండియా ఆటగాళ్లు పోరాడారు. అసలైన టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. చివరిరోజు ఆట ముగిసే సమాయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 334 పరుగులు చేసింది. టీమిండియా(Team India) ఆటగాళ్లు హనుమ విహారి(23 నాటౌట్: 161 బంతుల్లో 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్(39 నాటౌట్: 128 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్లకు అడ్డుగోడ కట్టడంతో ఆసీస్ ఆశలు గల్లంతయ్యాయి.
Also Read: India vs Australia: చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత
అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీ చేశాడు. చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 205 బంతులు ఎదుర్కొన్న పుజారా 77 పరుగులు చేసి ఔటయ్యాడు. రిషబ్ పంత్(97: 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగవంతమైన ఇన్నింగ్స్ భారత్ జట్టుకు ఆశలు కల్పించాయి.
Also Read: Ravichandran Ashwin: టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా
Match saved 🙌
Ashwin and Vihari batted well over a hundred deliveries each to earn India a memorable draw 👏🇮🇳
The thrill of Test cricket 😅#AUSvIND ▶️ https://t.co/jOSQoYOuSC pic.twitter.com/N8TDwKmgnZ
— ICC (@ICC) January 11, 2021
ఆ తర్వాత హనుమ విహారి, అశ్విన్(Ravichandran Ashwin)లు 250కి పైగా బంతులు ఆడి ఆసీస్ బౌలర్ల సహనాన్ని అన్ని విధాలుగా పరీక్షించారు. ఓటమి దిశగా వెళ్తున్న జట్టును డ్రా చేసి నైతిక విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ డ్రా చేసుకునేందుకు అత్యధిక ఓవర్లు బ్యాటింగ్ చేసిన జట్టుగా భారత్(131 ఓవర్లు) నిలిచింది.
Also Read: Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook