Ind vs Aus 2023: ఆ ఫేస్ పెట్టావేంటి గురూ.. సూర్యకుమార్ డకౌట్‌పై కోహ్లి ఎక్స్‌ప్రెషన్ వైరల్

Ind vs Aus 2023: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇండియా టాప్ ఆర్డర్‌ను ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ దారుణంగా దెబ్బతీశాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం డకౌట్‌గా వెనుదిరగాల్సిన పరిస్థితి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 11:13 AM IST
Ind vs Aus 2023: ఆ ఫేస్ పెట్టావేంటి గురూ.. సూర్యకుమార్ డకౌట్‌పై కోహ్లి ఎక్స్‌ప్రెషన్ వైరల్

Ind vs Aus 2023: మిచెల్ స్టార్క్. టీమ్ ఇండియాకు ఈ ఆస్ట్రేలియన్ పేసర్ వణుకు పుట్టిస్తున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండవ వన్జేలో మికెల్ స్టార్క్ మరోసారి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్‌ను డకౌట్ చేశాడు. సూర్యకుమార్ డకౌట్ కావడంపై విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగి మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడటంతో సిరీస్ 1-1 సమమైంది. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ వికెట్లను ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ పడగొట్టడంతో టీమ్ ఇండియా స్వల్ప పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఇండియాకు వణుకు పుట్టించాడు. ఈ నాలుగు వికెట్లలో ఒకటి సూర్య కుమార్ యాదవ్. వరుసగా మిచెల్ స్టార్క్ చేతిలో సూర్య కుమార్ యాదవ్ రెండవసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇండియా ఈ మ్యాచ్‌లో 117 పరుగులకే కుప్పకూలగా..టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 31 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అవడంపై కోహ్లీ షాక్ తిన్నాడు. ఆ సమయంలో కోహ్లీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ ఎక్స్‌ప్రెషన్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సూర్యకుమార్ ప్రస్తుతం టీమ్ ఇండియా నెంబర్ 4 స్థానంలో బరిలో దిగుతున్నాడు. వాస్తవానికి ఈ స్థానం శ్రేయస్ అయ్యర్‌ది. గాయం కారణంగా జట్టు నుంచి దూరం కావడం, తిరిగి ఎప్పుడు వస్తాడో కచ్చితంగా తెలియకపోవడంతో ప్రస్తుతానికి ఈ స్థానం ఖాళీగా ఉంది. అందుకే సూర్య కుమార్‌ను నెంబర్ 4 స్థానంలో దింపుతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వైట్ బాల్ ఆడటంలో సూర్య కుమార్ యాదవ్ చాలా సమర్ధుడని రోహిత్ శర్మ చెప్పాడు.

సూర్యకుమార్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిన అవసరముందని..రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడితే ఆ స్థానంలో సౌకర్యంగా ఫీలవుతాడని రోహిత్ తెలిపాడు. ప్రస్తుతానికి మరొకరి స్థానం ఖాళీగా ఉన్నందున సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్నాడని చెప్పారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో మరెవరున్నా అవకాశం ఇచ్చిన తరువాత పరుగులు తీయడంలో విఫలమైతే జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని రోహిత్ శర్మ వెల్లడించాడు.

Also read: IND vs AUS 3rd ODI Tickets: భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే.. టికెట్స్ కోసం ఫాన్స్ బారులు! దుప్పట్లు కప్పుకుని క్యూ లైన్‌లోనే కునుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News