ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్: మాస్కులు వేసుకున్న లంకేయులు

ఢిల్లీలో కాలుష్యం దెబ్బ టెస్టు క్రికెట్ మ్యాచ్ కు తగిలింది. లంక బౌలర్ గమాగే 123వ ఓవర్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దాంతో మ్యాచ్ ను కొన్ని కొద్దిసేపు ఆపేశారు.

Last Updated : Dec 5, 2017, 06:46 PM IST
ఢిల్లీ కాలుష్యం ఎఫెక్ట్: మాస్కులు వేసుకున్న లంకేయులు

ఢిల్లీలో కాలుష్యం దెబ్బ టెస్టు క్రికెట్ మ్యాచ్ కు తగిలింది. లంక బౌలర్ గమాగే 123వ ఓవర్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దాంతో మ్యాచ్ ను కొన్ని కొద్దిసేపు ఆపేశారు. ఫీల్డింగ్ లో ఉన్న లంకేయులు మొహాలకు మాస్క్ లు ధరించి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో, చుట్టుపక్కల వాతావరణ పరిస్థితుల గురించి ఆందోళన చెందారు. శ్రీలంక కెప్టెన్ చండీమల్ అంపైర్లతో కొద్దిసేపు అక్కడి పరిస్థితిపై మాట్లాడారు. తమ జట్టుకు వాతావరణం అనుకూలించడం లేదని.. ఆడలేమని చెప్పగా అంపైర్ సర్ది చెప్పారు. రెఫరీ పరిస్థితిని డాక్టర్ తో చర్చించి మ్యాచ్ ను కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో 15 నిమిషాల తరువాత ఆట ప్రారంభమైంది. కాగా ఢిల్లీలో పొగమంచు, కాలుష్యం గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఇక్కడ జరగాల్సిన రెండు రంజీ మ్యాచులు కూడా రద్దైయ్యాయి. 

 

 

 

Trending News