నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు నష్టపోయింది. తొలుత భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న టీమిండియా ఆసిస్ బౌలర్ల ధాటికి బ్యాట్స్ మేన్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా పుజారా - రహానే జోడీ శుభారంభాన్నిచ్చింది. ఇద్దరూ బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ చెరో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం పుజారా, రోహిత్ వెంటవెంటనే అవుటైనా.. పంత్ (28)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టేందుకు ప్రయత్నించిన రహానే సైతం వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి అశ్విన్ సహా టెయిల్ ఎండర్స్ అంతా వెనువెంటనే వికెట్లు సమర్పించుకోవడంతో 307 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్ ముందు 323 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా బ్యాట్స్ మేన్‌ని కట్టడి చేయడంలో పైచేయి సాధించిన ఆసీస్ బౌలర్లు లియాన్ ఆరు వికెట్లు, స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నారు. టీమిండియా బ్యాట్స్ మేన్స్‌లో పుజారా 71, రహానే 70, రాహుల్ 44, కోహ్లీ 34, పంత్ చేసిన 28 పరుగులు స్కోర్‌ని ఆ మాత్రం పెంచడానికి దోహదపడ్డాయి.
చెలరేగిన ఆసిస్ బౌలర్లు.. స్వల్ప వ్యవధిలోనే టీమిండియా ఆలౌట్ !