Hardik Pandya Trolls: వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉన్న టీమిండియా.. కీలక పోరులో చేతులెత్తిసింది. ఐదో టీ20లో కరేబియన్ జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి.. 3-2 తేడాతో సిరీస్‌ను సమర్పించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం విండీస్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. రెండు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పసలేని భారత బౌలింగ్‌పై వెస్టిండీస్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ చెలరేగి ఆడి విండీస్‌కు మ్యాచ్ విజయంతోపాటు సిరీస్‌ను అందించారు. టీమిండియా ఓటమితో కెప్టెన్ హార్థిక్ పాండ్యా భారీ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. నెట్టింట అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పాండ్యా.. 18 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో కేవలం 14 పరుగులే చేశాడు. ఓ ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతుంటే.. నెమ్మదిగా ఆడి బంతులను వృథా చేశాడు. భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద జేసన్ హోల్డర్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మొదటి ఓవర్ వేసిన పాండ్యా.. సిక్స్, ఫోర్ సమర్పించుకుని విండీస్ దూకుడుకు కారణమయ్యాడు. మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లు ఇచ్చాడు. మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇవ్వగా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Captain cool. Captain Clown. pic.twitter.com/Yj8cVi7GUO
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) August 6, 2023
బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు కెప్టెన్సీలోనూ హార్థిక్ పాండ్యా విఫలమయ్యాడని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 'మనం సిరీస్ ఓడిపోయి ఉండొచ్చు గానీ.. హార్థిక్ పాండ్యా భారత కాబోయే కెప్టెన్ కాలేడు..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్ కూల్ అయితే.. కెప్టెన్ క్లౌన్ పాండ్యా అని ఏకిపారేస్తున్నారు. టీమిండియాలో మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్ల పాండ్యానే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో పాండ్యాపై అభిమానులు ఫైర్ అవ్వడం ఇది తొలిసారి కాదు. మూడో టీ20లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేరువలో ఉన్నప్పుడు స్ట్రైకింగ్ ఇవ్వాల్సింది పోయి సిక్సర్ కొట్టాడు. అప్పుడు కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు.
We may loose this series or not, but I'm sure #hardik is not a captaincy option for India.#INDvsWI
Attitude not flying well at the moment pic.twitter.com/6I2I2ka4Lw— vikram singh (@vikram_social) August 13, 2023
ఇక ఈ టీ20 సిరీస్‌లో హార్దిక్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఐదు మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చిప పాండ్యా.. 25.67 సగటుతో 110 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి