Mohammed Siraj: మూడు బంతుల్లో రెండు వికెట్లు.. సిరాజ్ దెబ్బకు షాక్‌కు గురైన వెస్టిండీస్ ఫాన్స్ (వీడియో)!

Mohammed Siraj's cracking delivery outs Kyle Mayers in India vs West Indies 3rd ODI. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ఆదిలోనే టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ భారీ దెబ్బ కొట్టాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 28, 2022, 04:18 PM IST
  • మూడు బంతుల్లో రెండు వికెట్లు
  • సిరాజ్ దెబ్బకు షాక్‌కు గురైన వెస్టిండీస్ ఫాన్స్
  • 117 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
Mohammed Siraj: మూడు బంతుల్లో రెండు వికెట్లు.. సిరాజ్ దెబ్బకు షాక్‌కు గురైన వెస్టిండీస్ ఫాన్స్ (వీడియో)!

Mohammed Siraj's cracking delivery outs Kyle Mayers: పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌ వేదికగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో 117 పరుగుల భారీ తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించచిన ఈ మ్యాచును అంపైర్లు 36 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో విండీస్‌ టార్గెట్‌ను 257 పరుగులుగా నిర్దేశించగా 137 రన్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ఆదిలోనే టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ భారీ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. తొలి బంతికే ఓపెనర్ కైల్‌ మైర్స్‌ (0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 134 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. దాంతో విండీస్ మహిళా ఫాన్ ఒక్కసారిగా షాక్ అయింది. అయ్య బాబోయ్ అంటూ తలకు చేతులు పెట్టుకుని నోరు తెరిచింది. ఇక మూడో బంతికే షమర్ బ్రూక్స్‌ (0)ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను  కష్టాల్లో పడేశాడు.

మహ్మద్‌ సిరాజ్‌ బుల్లెట్ బంతులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. భారత ఫాన్స్ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచులో సిరాజ్ శుభారంభం ఇవాగా.. యుజ్వేంద్ర చహల్‌ 4, శార్దూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచారు. మొత్తానికి భారత బౌలింగ్ అటాక్‌కు విండీస్ బ్యాట‌ర్లు చేతులెల్తేశారు. ఈ సిరీస్‌లో స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 

Also Read: వధువుగా మారిన సారా టెండూల్కర్.. బ్రైడల్ లెహంగాలో వావ్ అనిపిస్తున్న సచిన్ తనయ!

Also Read: Goa Zuari River  Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News