Here is the reason why Pant Opening With Rohit: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే రెండో వన్డేలో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు.
సోదరి వివాహం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డే ఆడుతున్నాడు. అయినా కూడా ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపాడు. మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వెళ్లినపుడు రోహిత్ శర్మతో కలిసి పంత్ ఓపెనింగ్ చేయడం చూసి మొత్తం క్రికెట్ అభిమానులే కాకుండా మాజీలు, కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. అయితే పంత్‌ను ఓపెనర్‌గా దింపడానికి ఓ కారణం ఉంది.
వచ్చే వన్డే ప్రపంచకప్‌కు దృష్టిలో ఉంచుకుని జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేస్తున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కరోనా బారిన పడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గైర్హాజరీలో పంత్ రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ధావన్ లేకున్నా.. టీమిండియా ముందుకు సాగేందుకే ఈ ప్రయత్నం అని రోహిత్ చెప్పకనే చెప్పాడు. లోకేష్ రాహుల్ గత రెండేళ్లలో వన్డేలలో మిడిల్ ఆర్డర్‌లో బాగా రాణించాడు. అందుకే అతడిని ఆ స్థానంలోనే పరిమితం చేసేందుకు పంత్‌ను ఓపెనర్‌గా పంపాడు.
2ND ODI. WICKET! 11.1: Rishabh Pant 18(34) ct Jason Holder b Odean Smith, India 39/2 https://t.co/s9VCH5AHfn #INDvWI @Paytm
— BCCI (@BCCI) February 9, 2022
వన్డేలలో రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడం ఇదే మొదటిసారి. అయితే 2016 అండర్ 19 ప్రపంచకప్‌లో అతడికి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. పంత్ ఓపెనింగ్ ఒక ప్రత్యేకమైన ఎత్తుగడ అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన పంత్ మాత్రం నిరాశపరిచాడు. ఓడియన్ స్మిత్ వేసిన 12వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 18 పరుగులు మాత్రమే చేశాడు. మరి మూడో వన్డేలో పంత్ ఓపెనర్‌గా వస్తాడో లేదో చూడాలి.
Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్.. యాక్సిడెంట్‌లో యువకుడిని కాపాడిన రియల్ హీరో!! (వీడియో)
Also Read: Liger Prime Video: భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్.. పుష్ప కంటే డబుల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook