IND vs WI: భారత్‌దే బ్యాటింగ్‌.. బిష్ణోయ్‌, అశ్విన్‌లకు చోటు! తుది జట్టు ఇదే

India vs West Indies 1st T20I Playing 11 out, West Indies opt to bowl. భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో తొలి టీ20 ఆరంభం కానుంది.

Written by - P Sampath Kumar | Last Updated : Jul 29, 2022, 08:12 PM IST
  • భారత్‌దే బ్యాటింగ్‌
  • బిష్ణోయ్‌, అశ్విన్‌లకు చోటు
  • తుది జట్టు ఇదే
IND vs WI: భారత్‌దే బ్యాటింగ్‌.. బిష్ణోయ్‌, అశ్విన్‌లకు చోటు! తుది జట్టు ఇదే

IND vs WI 1st T20I: West Indies opt to bowl: భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య మరికాసేపట్లో తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. ఇంగ్లండ్‌లో మాదిరిగానే రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్  ఓపెనింగ్ చేయనున్నాడు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత టీ20 ఫార్మాట్‌లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడు. 

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌పై కన్నేసింది. తొలి మ్యాచులోనే గెలిచి సిరీస్ ఆధిక్యం సంపాదించాలని చూస్తోంది. మరోవైపు వన్డే సిరీస్‌ పరాభవానికి విండీస్ బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియం తొలి మ్యాచ్‌కు వేదిక. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. 

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రిషబ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా, రవిబిష్ణోయ్‌, ఆర్ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. వెస్టిండీస్‌: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), షిమ్రన్‌ హెట్మెయర్‌, రోమన్‌ పావెల్‌, ఓడియన్‌ స్మిత్‌, జేసన్‌ హోల్డర్‌, అకియల్‌ హోసీన్‌, రొమారియో షెపర్డ్‌, హేడెన్‌ వాల్ష్‌, అల్‌జారీ జోసెఫ్‌. 

Also Read: Wrong Challan: ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు!

Also Read: Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో 'ఆ' టాయ్స్.. పార్థబాబు కోరిక తీర్చలేదా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News