Ravi Shastri says Indian Pacer Mohammed Shami sitting at home baffles me: ఆసియా కప్ 2022 గ్రూప్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్‌పై వరుస విజయాలతో అదరగొట్టిన భారత్.. కీలకమైన సూపర్ 4లో చేతులెత్తేసింది. సూపర్ 4 తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓడిన భారత్.. శ్రీలంకతో జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. మంగళవారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తాజాగా జట్టు ఎంపికపై స్పందించాడు.
మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ... 'కీలకమైన మ్యాచ్‌లో గెలవాలంటే మంచి సన్నద్ధత అవసరం. ఆసియా కప్ 2022లో భారత్ జట్టు ఎంపిక ఉత్తమంగా ఉంటే బాగుండేది. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండవు. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆసియా కప్ 2022 కోసం రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మరొక పేసర్ అదనంగా ఉండాలి. మహమ్మద్ షమీ వంటి బౌలర్‌ను ఇంట్లో కూర్చోవడం సరైన నిర్ణయం కాదు. 15 మందిలో ఒక స్పిన్నర్‌ను తగ్గించి.. పేసర్ ఒకరిని అదనంగా తీసుకోవాలి. ఇప్పుడు అవేశ్ ఖాన్ జ్వరంతో బాధపడటం వల్ల డగౌట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇది జట్టుపై ప్రభావం చూపింది' అని అన్నారు.
జట్టును ఎంపిక చేయడంలో కోచ్ పాత్ర ఏమైనా ఉంటుందా అని పాకిస్తాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అడగ్గా... 'జట్టు ఎంపికలో హెడ్ కోచ్ కీలకమే. అయితే కోచ్ సెలెక్షన్ కమిటీలో భాగం కాదు. మాకు పాలనా జట్టు కావాలని మాత్రం చెప్పగలడు. అది కూడా కెప్టెన్ ద్వారా మేనేజ్మెంట్‌కు తెలియజేస్తాడు' అని రవిశాస్త్రి చెప్పారు. రెండు పర్యాయాలు రవిశాస్త్రి టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. రవిశాస్త్రి స్వయంగా తప్పుకోవడంతో.. రాహుల్ ద్రవిడ్ ఆ స్థానంలోకి వచ్చారు.
Also Read: నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా.. బీజేపీ లీడర్లను ఆటాడుకుంటున్న నెటిజన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook