Ind Vs SL: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. నేడే లంకేయులతో సమరం

IND Vs SL 1st T20 Match Preview: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ బరిలోకి దిగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 07:07 AM IST
  • భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 నేడే
  • రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం
  • తుది జట్టులో ఎవరుంటారు..?
Ind Vs SL: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. నేడే లంకేయులతో సమరం

IND Vs SL 1st T20 Match Preview: కొత్త ఏడాదిలో లంకేయులతో తొలి సమరానికి రెడీ అయింది టీమిండియా. భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కాబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకకు దుసన్ శనకా సారథిగా ఉన్నాడు. గతేడాది ఆసియా కప్ తరువాత ఇరు జట్లు తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా కప్‌లో భారత్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ తహతహలాడుతుండగా.. టీమిండియాకు మరోసారి అడ్డుకట్ట వేయాలని శ్రీలంక చూస్తోంది. రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్ల కూడిన టీమిండియా ఉత్సాహంగా కనిపిస్తోంది. బంగ్లాపై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానుండగా.. అతనికి జోడి రుతురాజ్ గైక్వాడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కోహ్లీ లేకపోవడంతో వన్‌డౌన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సూర్యకుమార్‌పైనే అందరి దృష్టి నెలకొంది. అతని సూపర్ ఇన్నింగ్స్ చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను చూడొచ్చు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. తనను తాను నిరూపించుకునేందుకు శాంసన్‌కు ఈ సిరీస్‌ చక్కటి అవకాశం.

ఇక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నాడు. పాండ్యాకు తోడు ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ మంచి ఫినిషింగ్ ఇస్తే భారత్‌కు తిరుగుండదు. వాంఖేడే పిచ్‌పై సత్తా చాటేందుకు చాహల్ రెడీగా ఉన్నాడు. ఇక స్పీడ్‌స్టార్ ఉమ్రాన్‌ మాలిక్ తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఉమ్రాన్‌కు తోడు అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.  

దుసన్ శనకా సారథ్యంలోని శ్రీలకం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఓపెనర్లు నిశాంక, కుశాల్‌ మెండిస్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. అసలంక, భానక రాజపక్స వంటి ఆటగాళ్లు కూడా చెలరేగేందుకు రెడీగా ఉన్నారు. ధనంజయ డిసిల్వా, హసరంగ, శనక, చమిక కరుణరత్నె ఇటు బ్యాట్‌తోనూ.. అటు బంతితోనూ రాణించగలరు. ముఖ్యంగా హసరంగ బంతితో చాలా ప్రమాదకరం. తీక్షణ, లహిరు కుమార, మదుశంక వంటి బౌలర్లు భారత్‌కు చెక్ పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. 

తుది జట్లు (అంచనా):

భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, డిసిల్వా, రాజపక్స, అసలంక, శనకా (కెప్టెన్), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, మదుశంక, లహిరు కుమార

Also Read: Navodaya Notification: నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే లాస్ట్  

Also Read: SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News