India Vs Sri Lanka World Cup 2023: శ్రీలంక బౌలర్లపై టీమిండియా దండయాత్ర.. లంకేయులకు భారీ టార్గెట్

IND Vs SL 1st Innings Updates: శ్రీలంకకు భారీ టార్గెట్ విధించింది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 2, 2023, 09:28 PM IST
India Vs Sri Lanka World Cup 2023: శ్రీలంక బౌలర్లపై టీమిండియా దండయాత్ర.. లంకేయులకు భారీ టార్గెట్

IND Vs SL 1st Innings Updates: శ్రీలంక బౌలర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్ దండయాత్ర చేశారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. గురువారం శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయాస్ అయ్యర్ (82), రవీంద్ర జడేజా (35) చెలరేగి ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక ఐదు వికెట్లు పడగొట్టాడు. దుశాన్ చమీరాకు ఒక వికెట్ దక్కింది. 358 పరుగుల లక్ష్యంతో శ్రీలంక బరిలోకి దిగనుంది. ఈ భారీ టార్గెన్‌ను లంకేయులు ఛేదిస్తారో లేదో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే శ్రీలంక సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా మొదట బ్యాటింగ్ ఆరంభించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఆరంభంలోనే ఔట్ అవ్వడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధుషంక చక్కటి బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో క్రీజ్‌లో వచ్చిన కోహ్లీ శుభ్‌మన్ గిల్‌తో కలిసి శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 88, 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించారు. సెంచరీకి చేరువగా ఉన్న సమయంలో గిల్‌, కోహ్లీలను ఔట్ చేసి మళ్లీ దెబ్బ తీశాడు మధుషంక.

కేఎల్ రాహుల్ (21)ను చమీరా ఔట్ చేయడంతో 256 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోరుకే వెనుతిరగడంతో టీమిండియా భారీ స్కోరు చేయడం కష్టమనిపించింది. అయితే అవతలి ఎండ్‌లో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. రవీంద్ర జడేజా 24 బంతుల్లో 35 పరుగులు చేయడంతో టీమిండియా చివరకు 50 ఓవర్లలో 357 రన్స్ చేసింది. 

ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న శ్రేయాస్ అయ్యర్.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం టీమిండియాకు బిగ్‌ రిలీఫ్‌. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక 10 ఓవర్లలో 80 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లను దిల్షాన్ మధుశంక అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ రనౌట్ అయ్యారు.

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News