IND vs SA: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. గాయపడిన స్టార్ పేసర్! బరిలోకి దిగడం కష్టమే?

జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఫాస్ట్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 08:23 AM IST
  • టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
  • మహ్మద్ సిరాజ్‌కు గాయం
  • ఈరోజు బరిలోకి దిగడం కష్టమే
IND vs SA: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. గాయపడిన స్టార్ పేసర్! బరిలోకి దిగడం కష్టమే?

Mohammed Siraj injured before stumps on Day 1: జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు టీమిండియా (Team India)కు ఏమాత్రం కలిసిరావడం లేదు. మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గాయపడడంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. ఇక ఆట ముగిసే సమయానికి ఫాస్ట్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడ్డాడు. మొదటిరోజు చివరలో సిరాజ్ తన ఓవర్‌లో గాయపడి మైదానం వీడడం ఇప్పుడు భారత జట్టుకు కొత్త తలనొప్పిగా మారింది. 

తొలి రోజు చివరి సెషన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఆట ముగిసేందుకు మరో 7 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. చివరి బంతికి రౌండ్ ది వికెట్ పరుగెత్తడం ప్రారంభించాడు కానీ బాల్ విడుదల చేసే సమయంలో స్టంప్‌ల దగ్గరికి వచ్చేసరికి కుడి తొడ పట్టేసింది. దాంతో అతడు ఇబ్బందిపడ్డాడు. సిరాజ్ పరిస్థితి (Mohammed Siraj Injury)ని చూసిన టీమ్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే మైదానానికి చేరుకున్నాడు. రోజులో ఇంకా ఒక ఓవర్ మాత్రమే ఉంది కాబట్టి ఫిజియో సిరాజ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు.

Also Read: Today's Horoscope: 4-1-2022 మంగళవారం.. ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి!!

మొహ్మద్ సిరాజ్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే సిరాజ్‌ పరిస్థితిని చూస్తే.. అతని తొడలో ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఈరోజు సిరాజ్ బరిలోకి దిగడం కష్టమే అని తెలుస్తోంది. ఇదే నిజమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. మొదటి రోజు సిరాజ్ 3.5 ఓవర్లు వేసి 4 పరుగులు ఇచ్చాడు. అందులో 2 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. సిరాజ్ తొలి టెస్టులో కీలక వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 

రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు తడబడింది. మిడిల్‌ ఆర్డర్‌ పేలవ ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. లోకేష్ రాహుల్‌ (50; 133 బంతుల్లో 9×4), ఆర్ అశ్విన్‌ (46; 50 బంతుల్లో 6×4) రాణించారు. స్టార్ బ్యాటర్లు చేటేశ్వర్ పుజారా (3), అజింక్య రహానే (0) మళ్లీ విఫలమయ్యారు. ప్రొటీస్ బౌలర్లు జాన్సన్‌ (4/31), అలివీర్‌ (3/64), రబాడ (3/64) రాణించారు. సోమవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా (South Africa) తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. 

Also Read: PKL Telugu Titans Match: మరోసారి ఓటమి పాలైన తెలుగు టైటాన్స్- పట్నా పైరేట్స్ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News