IND vs SA: బౌన్సర్లతో రెచ్చిపోయిన జాన్సెన్.. తగ్గేదెలా అన్న బుమ్రా! అంపైర్ జోక్యం చేసుకోవడంతో..!!

టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సెన్‌తో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా గొడవపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 08:27 AM IST
  • బౌన్సర్లతో రెచ్చిపోయిన జాన్సెన్
  • మార్కో జాన్సెన్‌తో బుమ్రా గొడవ
  • తగ్గేదెలా అన్న బుమ్రా
IND vs SA: బౌన్సర్లతో రెచ్చిపోయిన జాన్సెన్.. తగ్గేదెలా అన్న బుమ్రా! అంపైర్ జోక్యం చేసుకోవడంతో..!!

Jasprit Bumrah had a face off with Marco Jansen: మూడు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సహనం కోల్పోయాడు. తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి బౌలర్‌పై గొడవకు దిగాడు. బుధవారం (జనవరి 5) టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సెన్‌తో యార్కర్ కింగ్ బుమ్రా గొడవపడ్డాడు. చివరకు అంపైర్ జోక్యం చేసుకోవడంతో.. గొడవ అక్కడితో ముగిసిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వార్తలు అనే ట్విట్టర్ పేజీలో వీడియో ఉంది. 

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయిది. మొహ్మద్ షమీ 8వ వికెట్ రూపంలో ఔట్ కాగానే.. జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. వెంటనే బుమ్రాకి మార్కో జాన్సెన్‌ వరుసగా షార్ట్ పిచ్ బంతుల్ని సంధించాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్‌ 54వ ఓవర్లోని ఓ బంతి బుమ్రా భుజానికి బలంగా తాకింది. బుమ్రాను వెక్కిరిస్తూ జాన్సన్ నోరుపారేసుకున్నాడు. అప్పుడు జాన్సన్ వైపు చూసిన బుమ్రా.. ఏమనకుండా తన భుజంపై దుమ్ముని దులుపుకున్నాడు. దాంతో జాన్సన్ ఒకింత ఆవేశానికి గురయ్యాడు. 

Also Read: Breaking News: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 10న బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

ఆ తర్వాత బంతిని కూడా మార్కో జాన్సెన్‌ షార్ట్ పిచ్ రూపంలో సంధించగా.. ఫుల్ షాట్ ఆడబోయిన జస్ప్రీత్ బుమ్రా మరోసారి విఫలమయ్యాడు. జాన్సన్ మళ్లీ నోరు జారడంతో బుమ్రా సహనం కోల్పోయాడు (Bumrah Loses Calm). మాటకి మాట బదులిస్తూ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. మరోవైపు జాన్సన్ కూడా అరుస్తూ పిచ్ మధ్యలోకి వచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం (Bumrah Had A Face Off With Marco Jansen) నడిచింది. ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కాస్త దూకుడుగా ఉండడంతో ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకున్నాడు. ఇద్దరికీ సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. 

గొడవ అనంతరం మార్కో జాన్సెన్‌ సూచనల మేరకు కాగిసో రబాడ (Rabada) కూడా జస్ప్రీత్ బుమ్రాకు బౌన్సర్‌ బౌల్స్ వేశాడు. అయితే ఈ సారి  బుమ్రా అద్భుతమైన సిక్స్ (Bumrah Six) బాదాడు. భారత పేస్ గుర్రం సిక్స్‌ను చూసిన టీమిండియా ప్లేయర్స్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆపై  రబాడ ఇంకో బౌన్సర్‌ వేయగా.. బుమ్రా అడ్డుకున్నాడు. అయితే 7 పరుగులు మాత్రమే చేసిన బుమ్రా.. లుంగీ ఎగిండి బౌలింగ్‎లో ఔటయ్యాడు. ఇక్కడ విషయం ఏమిటంటే జాన్సన్ ఆ క్యాచ్ పట్టాడు. బుమ్రా, జాన్సెన్‌ ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడారు. ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ బుమ్రా, జేమ్స్ అండర్సన్‌ల మధ్య ఇలాంటి బాహాబాహి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. కేంద్రం అధికారిక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News