Warner - Kohli: వైఫల్యాలు సహజమే.. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాటర్ విఫలమైనా పర్వాలేదని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 03:42 PM IST
  • బంగ్లాదేశ్‌పై చివరి సెంచరీ
  • కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు
  • విఫలమవ్వడం అర్థం చేసుకోదగిన విషయమే
 Warner - Kohli: వైఫల్యాలు సహజమే.. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్

David Warner supports Virat Kohli's ongoing lean patch: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) లాంటి అత్యుత్తమ బ్యాటర్ విఫలమైనా పర్వాలేదని ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. కోహ్లీ గత రెండేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. మూడంకెల స్కోర్ అందుకుని దాదాపుగా రెండేళ్లవుతోంది. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి సెంచరీ (Virat Kohli Century) చేశాడు. ఈ 2 ఏళ్లలో ఒక్కోసారి తక్కువ స్కోరుకు కూడా పరిమితం అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో అతడి బ్యాటింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. 

'బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా' అనే ఓ జాతీయ మీడియాతో తాజాగా మాట్లాడిన డేవిడ్ వార్నర్‌ (David Warner).. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందించాడు. 'గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్లలో కరోనా వైరస్ మహమ్మారి ఎంతలా ప్రభావం చూపిందో అందరికి తెలుసు. కోహ్లీకి ఓ పాప కూడా పుట్టింది. కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమైనా ఫర్వాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ ఆట ఆడుతున్న ఆటగాడు ఇప్పుడు విఫలమవ్వడం అర్థం చేసుకోదగిన విషయమే. అందుకు అతడు పూర్తి అర్హత కలిగినవాడు. చేసే పనిలో మీరు బాగా ఉన్నప్పుడు విఫలమయ్యే హక్కు కూడా ఉంటుంది' అని వార్నర్ అన్నాడు. 

Also Read: Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!

'ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) కూడా గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదు. కానీ స్మిత్ ప్రతి నాలుగు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చేస్తాడని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వారిపై అధిక ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నా. అందరం మానుషలమే' అని డేవిడ్ వార్నర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలో ఉన్న విరాట్‌ కోహ్లీ.. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మూడో టెస్టుకు విరాట్ తిరిగివస్తాడని సమాచారం. ఈ టెస్టులో అయినా టీమిండియా టెస్ట్ కెప్టెన్ రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: RGV vs AP Govt: ఆర్జీవీ సర్.. ప్రేక్షకుడికి నొప్పి లేదని నీకు ఎవరు చెప్పారు?! నేను 1000 పెట్టి టికెట్ కొనలేను!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News