సౌతాఫ్రికాతో జరుగుతున్న 6 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతున్న 5వ వన్డేలో టీమిండియాపై 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే తడబాటుకి గురైంది. 13 ఓవర్లలో స్కోర్ బోర్డ్ 65కి చేరుకునేటప్పటికే ముగ్గురు పెవిలియన్ బాటపట్టారు. మర్కం (32), డుమిని (1), ఏబీ డివిలయర్స్ (6) లాంటి కీలకమైన వికెట్లు అతి స్వల్ప స్కోర్‌కే పడిపోయాయి. అనంతరం అంతో పరుగులు రాబట్టిన డేవిడ్ మిల్లర్(36)ని చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 71 పరుగులతో సౌతాఫ్రికా స్కోర్ బోర్డ్ మంచి స్కోర్ జోడించిన హషీమ్ ఆమ్లా సైతం 35 ఓవర్ల వద్ద ఔట్ అయ్యాడు. విజయ లక్ష్యాన్ని అందుకోవడానికి మరో 109 పరుగులు అవసరం వున్నాయనే కీలక దశలోనే కీలకమైన వికెట్లు పడిపోవడంతో సఫారీల టీమ్ కష్టాల్లో పడింది.
కడపటి వార్తలు అందే సమయానికి సౌతాఫ్రికా విజయ లక్ష్యానికి 68 బంతుల్లో 87 పరుగులు అవసరం వున్నాయి. ప్రస్తుతానికి రబడ, క్లాసెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. అంతిమంగా విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి!