IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!

వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ నిలిచాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 09:01 AM IST
  • సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
  • తొలి బ్యాటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు
  • అగ్ర స్థానంలో కుమార సంగక్కర
IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!

 Virat Kohli breaks Sachin Tendulkar's massive record: రికార్డుల రారాజుగా పేరున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బోలాండ్ పార్క్ వేదిక‌గా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే (IND vs SA 1st ODI)లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

భారత్ వెలుపల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుధవారం (జనవరి 19) వరకూ సచిన్ టెండూల్కర్ 5065 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తొలి వన్డేలో 9 పరుగులు చేయడం ద్వారా ఆ రికార్డ్‌ని 5066 పరుగులతో విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ ఔటయ్యే సమయానికి 5108 పరుగులతో టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ, సచిన్ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 4520 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ సారథులు రాహుల్ ద్రవిడ్ (3998), సౌరవ్ గంగూలీ (3468) పరుగులతో టాప్-5లో ఉన్నారు.

Also Read: U-19 World Cup - Covid 19: టీమిండియాలో కరోనా కలకలం.. కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌! సూపర్ లీగ్ దశకు అర్హత!

50 ఓవర్ల ఫార్మాట్‌లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (Kumar Sangakkara) అగ్ర స్థానంలో ఉన్నాడు. సంగా విదేశాల్లో 5518 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ.. 5108 పరుగులతో రెండో స్థానములోకి దూసుకొచ్చాడు. 5090 పరుగులతో పాంటింగ్ మూడో స్థానంకి పడిపోయాడు.
 
తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్‌ ( Virat Kohli Record)ని కూడా అందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. తొలి వన్డేకి ముందు 1287 పరుగులతో మూడో స్థానంలో ఉన్న కోహ్లీ.. హాఫ్ సెంచరీ (51) చేయడం ద్వారా 1338 రన్స్‌తో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. సఫారీలపై సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 1313 పరుగులు చేయగా.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) 1309 పరుగులు చేశాడు.  మొత్తంగా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) 1879 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.

Also Read: IND vs SA 1st ODI: శార్దుల్‌ ఠాకూర్‌ పోరాడినా.. తొలి వన్డేలో టీమిండియాకు తప్పని ఓటమి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News