India Vs Pakistan Toss and Playing 11: ఆసియా కప్‌లో అసలు సమరానికి భారత్, పాక్ జట్లు రెడీ అయ్యాయి. క్యాండీలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో దాయాదుల మధ్య సమరం జరుగుతోంది. మాంచెస్టర్‌లో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ తరువాత వన్డేల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముంపు భయం పొంచి ఉండగా.. ప్రస్తుతానికి వరుణుడు శాంతించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మహ్మద్ షమీ తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ అంచనా వేయగా.. ఆశ్చర్యకరంగా శార్దుల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.
"మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. కొంచెం పొడి వాతావరణం ఉంది. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడాలి. సవాళ్లను, పరిస్థితులను స్వీకరించాలి. వెస్టిండీస్ సిరీస్ తర్వాత మాకు కొంత సమయం దొరికింది. బెంగుళూరులో ట్రైనింగ్ సెషన్ తరువాత సవాళ్ల కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ టోర్నీలో ఏం సాధిస్తామో చూద్దాం. అయ్యర్, బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు.." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
"మేము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లం. కానీ టాస్ మా చేతుల్లో లేదు. ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి మాకు పరిస్థితులు తెలుసు. అగ్రశ్రేణి జట్లు ఆడుతుండడంతో ఆసియా కప్ బాగుంది. మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. జట్టులో ఎటువంటి మార్పులు లేవు. మంచి ప్రదర్శన చేయడం ఎల్లప్పుడూ మీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది అధిక తీవ్రతతో కూడిన మ్యాచ్. మేము ప్రశాంతంగా, కంపోజ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాము.." అని పాక్ కెప్టెన్ బాబార్ అజామ్ తెలిపాడు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, ఆఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.
Also Read: Jailer Movie: ఓటీటీలో విడుదల కానున్న జైలర్ సినిమా, ఎప్పుడు ఎందులోనంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook