IND vs PAK, Aaqib Javed talk about Indian pace Bowling: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ 2022 నేడు ఆరంభం అయింది. నేటి నుంచి కావలిఫైయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. సూపర్ 12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అక్టోబర్ 23న దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ టీమిండియా బౌలింగ్‌పై స్పందించాడు.
గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోందని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత పేస్ అటాక్ ఎలా ఉంటుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఆకిబ్ జావెద్ స్పందించాడు. బుమ్రా లేని లోటు భారత జట్టుపై ప్రభావం చూపనుందని చెప్పాడు. ఇంపాక్ట్ బౌలర్లు లేకపోవడంతో ఆసీస్ గడ్డపై టీమిండియాకు కష్టమే అని అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఆకిబ్ జావెద్ ఓ మీడియాతో మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. షాహీన్ షా ఆఫ్రిది, రవూఫ్ లాంటి ఇంపాక్ట్ బౌలర్లు భారత జట్టులో లేరు. ఇంపాక్ట్ బౌలర్ ప్రత్యర్థి బ్యాటర్లపై చాలా ఒత్తిడి తీసుకువస్తాడు. ప్రస్తుతం టీమిండియాలో మీడియం పేస్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఆసీస్ గడ్డపై కష్టమే. అయితే ఏ సమయంలోనైనా ఆటను మార్చగల శక్తి హార్దిక్ పాండ్యాకు ఉంది. అతడు రాణిస్తే భారత జట్టుకు లాభమే' అని అన్నాడు.
గాయాల కారణంగా రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను, బుమ్రా స్థానంలో మొహ్మద్ షమీని టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నారు. మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు. భువనేశ్వర్, అర్షదీప్, పాండ్యాపైనే భారత్ ఆశలు పెట్టుకుంది.
Also Read: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. ఆసియా కప్ ఛాంపియన్‌కు షాకిచ్చిన నమీబియా!
Also Read: జీవితంలో ఈ చిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదు.. చేశావో జీవితాంతం శనితో సావాసమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook