IND Vs NED Highlights: నెదర్లాండ్స్‌పై టీమిండియా భారీ విజయం.. అజేయంగా సెమీస్‌లోకి ఎంట్రీ..!

India Vs Netherlands ICC World Cup 2023: నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. వరల్డ్ కప్‌లో లీగ్ దశలో ఆడిన 9 విజయాల్లో 9 విజయాలు సాధించి.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 12, 2023, 10:18 PM IST
IND Vs NED Highlights: నెదర్లాండ్స్‌పై టీమిండియా భారీ విజయం.. అజేయంగా సెమీస్‌లోకి ఎంట్రీ..!

India Vs Netherlands ICC World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా మరో గ్రాండ్ విక్టరీ నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో విజయం సాధించి.. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లను గెలపొంది అజేయంగా ముగించింది. సెమీస్‌కు ముందు భారీ విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలతో చెలరేగ్గా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ టీమ్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అవార్డు దక్కింది. ఈ నెల 15న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో టీమిండియా సెమీ ఫైనల్‌లో తలపడనుంది. 

భారత్ విధించిన 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వెస్లీ బరేసీ (4)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తరువాత కోలిన్ అకెర్‌మాన్, మాక్స్ ఓడౌడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడిని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 13వ ఓవర్‌లో కోలిన్ అకెర్‌మన్ (35)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో మ్యాక్స్ ఒడాడ్ (30) జడేజా బౌలింగ్‌లో  ఔట్ అయ్యాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్  (17) వికెట్‌ను విరాట్ కోహ్లీ పడగొట్టాడు. 

బాస్ డి లీడ్ (12)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా... అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్‌ (45)ను సిరాజ్ పెవిలియన్‌కు పంపించాడు. లాంగా వాన్ బీక్ (16), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (16), ఆర్యన్ దత్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు మాత్రం అదరగొట్టాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఎదురుదాడికి దిగాడు. 39 బంతుల్లోనే 54 పరుగులు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తేజ ఒక ఫోరు, 6 సిక్సర్లు బాదడం విశేషం. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (94 బంతుల్లో 128, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్థ సెంచరీలో నెదర్లాండ్స్ బౌలర్ల పనిపట్టారు. బాస్ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీశారు. వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై 413 పరుగులు టాప్ స్కోరుగా ఉంది.  

Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News