ఇండియా vs ఇంగ్లండ్ : కోహ్లీ ఒంటరిపోరుతో గట్టెక్కిన భారత్

ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరు చేసి టీమిండియాను గట్టెకించాడు            

Last Updated : Aug 3, 2018, 03:50 PM IST
ఇండియా vs ఇంగ్లండ్ : కోహ్లీ ఒంటరిపోరుతో గట్టెక్కిన భారత్

ఎడ్జ్‌బాస్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరు చేసి టీమిండియాను గట్టెక్కించాడు.  కోహ్లీ మినహా టీమిండియా బ్యాట్స్‌మెన్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లందరూ వరసగా క్యూ కడుతున్నప్పటికీ..  కోహ్లీ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకానొక దశలో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో.. కోహ్లీ సమయోచితంగా ఆడుతూ జట్టు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. మొత్తం 225 బంతులు ఎదుర్కొన్న విరాట్ 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. కోహ్లీ చేసిన ఒంటరి పోరాటం కారణంగానే టీమిండియా 274 పరుగులు చేసి గౌరవప్రదమైన స్థితికి చేరింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌లో 287 పరుగులు చేసిన విషయం తెలిసిందే.అంటే టీమిండియా 13 రన్స్ తేడాతో వెనుకంజలో ఉందన్న మాట. 

ఉత్కంఠ పోరు తప్పదా..

ఇదిలా ఉండగా 13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్లు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అలిస్టర్ కుక్  డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం జెన్నింగ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 3.5 ఓవర్లు ఎదుర్కొని 9 పరుగులు చేసింది. ఈ రోజు సాధ్యమైనంత త్వరగా వికెట్లు తీసి ఇంగ్లండ్ పై చేయి సాధించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేసి టీమిండియాపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. దీంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

టీమిండియా తొలి ఇన్నింగ్ స్కోర్ వివరాలు

 

Trending News