ENG vs IND 5th Test: రోహిత్‌కు కరోనా.. కోహ్లీ, పూజారా ఫామ్‌పై అనుమానాలు! ఇక ఆశలన్నీ వారిపైనే

India vs England 5th Test: India hops on Bowlers only. ఇంగ్లిష్‌ గడ్డపైన తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలని చూస్తున్న టీమిండియాకు బ్యాటింగ్ విభాగం ఫామ్, గాయాలు కలవరపెడుతోంది.    

Written by - P Sampath Kumar | Last Updated : Jun 30, 2022, 01:37 PM IST
  • రోహిత్‌కు కరోనా
  • కోహ్లీ, పూజారా ఫామ్‌పై అనుమానాలు
  • ఇక ఆశలన్నీ వారిపైనే
ENG vs IND 5th Test: రోహిత్‌కు కరోనా.. కోహ్లీ, పూజారా ఫామ్‌పై అనుమానాలు! ఇక ఆశలన్నీ వారిపైనే

India vs England 5th Test, India hops on Bowlers only: ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఏకైక టెస్ట్ మ్యాచుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం (జూన్ 1) నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. టీమిండియా చివరి మ్యాచ్‌ను గెలిచినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో సిరీస్ గెలవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. 

ఇంగ్లిష్‌ గడ్డపైన తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలని చూస్తున్న టీమిండియాకు బ్యాటింగ్ విభాగం ఫామ్, గాయాలు కలవరపెడుతోంది.  బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరమయ్యాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా మహమ్మరి బారిన పడడంతో మ్యాచ్ ఆడతాడో లేదో కూడా తెలియదు. దాంతో ఓపెనర్ల ఇద్దరి సేవలు భారత్ కోల్పోనుంది. ఇక స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, చేటేశ్వర్ పూజారాల ఫామ్‌లపై అనుమానాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ ఇంగ్లీష్ గడ్డపై ఎలా ఆడతాడో తెలియదు. రిషబ్ పంత్ ఒక్కడే పరుగులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ బౌలర్లనే నమ్ముకుని బరిలోకి దిగనుంది. 

నాలుగు టెస్టుల్లో బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్‌, ఓవల్‌ మ్యాచ్‌లను భారత్ గెలిచింది. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 18 పడగొట్టగా.. మహ్మద్‌ సిరాజ్ 14 వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీ 3 మ్యాచ్‌ల్లో 14, శార్దూల్‌ ఠాకూర్‌ 2 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశారు. వీరికి తోడు స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు. వీరు మళ్లీ చెలరేగితే ఇంగ్లీష్ జట్టును కట్టడిచేయడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తానికి భారత్ బౌలర్లపైనే ఆధారపడనుంది. 

ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో భారత్ జట్టు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ వ్యూహంతో బరిలోకి దిగింది. చివరి టెస్టుకు కూడా ఇదే వ్యూహంతో బరిలోకి దిగనుంది. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌, మొహ్మద్ షమీ తుది జట్టులో ఉండొచ్చని తెలుస్తోంది. నాలుగో బౌలర్‌గా శార్దూల్‌ ఠాకూర్, ఆర్ అశ్విన్‌లలో ఎవరికైనా అవకాశం దక్కొచ్చు. పిచ్‌ పరిస్థితులను బట్టి జట్టు మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవారే. 

Also Read: Trending Video: ఇదేం ‘ర్యాంప్ వాక్’ భయ్యా...నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో

Also Read: Hyd Drugs Issue: హైదరాబాద్‌లో వెలుగులోకి సరికొత్త మత్తు దందా..కోడ్‌ ద్వారా విక్రయాలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News