Virat Kohli Record: మరో 64 పరుగులే.. క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ! సచిన్‌ కూడా వెనకాలే

Virat Kohli away 64 runs to become fastest player complete 25 thousnad runs in international Cricket. 25 వేల పరుగులు పూర్తిచేయడానికి విరాట్ కోహ్లీకి కేవలం 64 రన్స్ అవసరం అయ్యాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 6, 2023, 10:42 PM IST
  • మరో 64 పరుగులే
  • క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ
  • సచిన్‌ కూడా వెనకాలే
Virat Kohli Record: మరో 64 పరుగులే.. క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ! సచిన్‌ కూడా వెనకాలే

Virat Kohli 64 runs away to completes 25000 runs in international cricket: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 4 టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి మొదలు కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌ దక్కించుకునేందుకు ఇరు జట్లు పోటీ పడనున్నాయి. నాగపూర్ మైదానంలో తొలి టెస్ట్ కోసం ముమ్ముర సాధన చేస్తున్నారు. అయితే ఈ టెస్ట్ ద్వారా భారత బ్యాటర్‌, టీమిండియా మాజీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బద్దలు కానుంది.  

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 25 వేల పరుగులు పూర్తిచేయడానికి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేవలం 64 రన్స్ అవసరం అయ్యాయి. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు 546 ఇన్నింగ్స్‌ల్లో 24936 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం అయ్యే తొలి టెస్ట్‌లో ఇంకా 64 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకే 543 ఇన్నింగ్స్‌లు పట్టాయి. 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు మూడు ఫార్మాట్లలో 24000 పరుగులు పూర్తి చేసేందుకు 565 ఇన్నింగ్స్‌లు పట్టగా.. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్‌ కలిస్‌కు 573 ఇన్నింగ్స్‌లు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ముందు 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేశాడు. 

కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు), రికీ పాంటింగ్‌ (688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులు), జాక్‌ కలిస్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 25534) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నాగపూర్ టెస్టులో విరాట్ కోహ్లీ మరో 64 రన్స్ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 25 వేల పరుగులు త్వరగా చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 

Also Read: Rohit Sharma Captain: రోహిత్‌ శర్మ ముందు అరుదైన రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!  

Aslo Read: Infosys Fresher Employees: శిక్షణ అనంతరం.. 600 మంది ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News