Ind Vs Aus Test Series: ఆసీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి రెండు టెస్టులను కూడా గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అకస్మాత్తుగా సొంత దేశానికి వెళ్లిపోయాడు. కమిన్స్ హఠాత్తుగా స్వదేశానికి పయనం కావడంతో కంగారూ జట్టులో ఆందోళన కనిపిస్తోంది. కుటుంబంలో తీవ్రమైన అనాఆరోగ్య సమస్య కారణంగా కమిన్స్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టు మ్యాచ్‌కి ముందే భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
మూడు నుంచి నాలుగు రోజుల పాటు సిడ్నీలో కమిన్స్ ఉండనున్నాడు. మార్చి 1 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుండగా ఆలోపు జట్టుతో చేరనున్నాడు. ఈ సిరీస్‌లో కమిన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు.
రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో కమిన్స్ తమ జట్టు ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. కొంతమంది బ్యాట్స్‌మెన్లు చెత్త షాట్లు ఆడి అవుట్ అయ్యారని అన్నాడు. భాతర్ బాగా బౌలింగ్ చేసిందని తాను అనుకుంటున్నానని.. వారి అత్యుత్తమ స్పిన్నర్లను ఎదుర్కొవడం అంత సులభం కాదన్నాడు. దురదృష్టవశాత్తూ తమ జట్టు ఆటగాళ్లు చెత్త షాట్లను ఆడడంతో ఔట్ అయ్యారని అన్నాడు.
'రెండో ఇన్నింగ్స్‌లో మేము లైట్ తీసుకున్నాం. భారత బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు మార్గం మాకు ఉంది. ఈ రకమైన బ్యాటింగ్‌ను చూసి నేను మరింత నిరాశకు గురయ్యాను. ఇలాంటి అవకాశాలు అన్ని సమయాలలో రావని తెలుసు. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ అది సాధ్యం కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు చేసి ఉంటే.. గట్టి పోటీ ఇచ్చేవాళ్లం..' అని కమిన్స్ మ్యాచ్ అనంతరం మీడియాతో అన్నాడు.
Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్
Also Read: Tirumala Woman Death: బాత్‌రూమ్‌లోకి వెళ్లి నిప్పంటించుకుని.. తిరుమలలో మహిళ ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి