Ricky Ponting's advice for Rohit Sharma ahead of IND vs AUS 4th Test: ప్రస్తుతం భారత గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు టెస్టులు భారత్ గెలవగా.. మూడో టెస్ట్ ఆసీస్ గెలిచింది. మూడో టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కు దూసుకెళ్లింది. మరోవైపు భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే.. టీమిండియాకు ఈ టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
భారత జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను తప్పించి.. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. అయితే మూడో టెస్టులో గిల్ (21, 5) నిరాశపరిచాడు. దాంతో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు రాహుల్, గిల్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి?.. మిడిల్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్ లేకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? అనేది తెలియాలంటే టాస్ వరకు ఆగాల్సిందే. రాహుల్, గిల్, సూర్యలో ఎవరికి స్థానం దక్కుతుందో చూడాలి.
అయితే కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరినీ తీసుకోవాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. 'మూడో టెస్టులో కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడాడు. ఆ టెస్టులో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే నాలుగో టెస్టులో ఇద్దరినీ ఆడిస్తే చాలా బాగుంటుంది. గిల్‌ను ఓపెనింగ్‌కు పంపి.. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించొచ్చు. గతంలో కూడా రాహుల్ ఐదో స్థానంలో టెస్టు క్రికెట్ ఆడాడు' అని పాంటింగ్ పేర్కొన్నాడు.
'ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగే యూకేలోని పిచ్ పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బంతి ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉంటుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు కచ్చితంగా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాయి. ఇది కేవలం టెస్టు మ్యాచ్ మాత్రమే కాదు. ఇరు జట్లకూ చాలా కీలకం' అని మాజీ ఆసీస్ ప్లేయర్ రికీ పాంటింగ్ తెలిపాడు.
Also Read: Pragya Jaiswal Photos: డెనిమ్ షార్ట్, జాకెట్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. రెండిటి బటన్స్ విప్పేస్తూ టీజింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.