IND vs AUS: గవాస్కర్.. మీరు చాలా కఠినమైన వ్యక్తి! గిల్ విషయంలో సన్నీపై హేడెన్‌ ఘాటు వ్యాఖ్యలు

Matthew Hayden says Sunil Gavaskar too harsh on Shubman Gill Injury. భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్‌ మధ్య వాడీవేడీగా సంభాషణ జరిగింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 2, 2023, 10:50 AM IST
  • గవాస్కర్.. మీరు చాలా కఠినమైన వ్యక్తి
  • సన్నీపై హేడెన్‌ ఘాటు వ్యాఖ్యలు
  • రెండు బంతులు వేచి చూస్తే బాగుండేది
IND vs AUS: గవాస్కర్.. మీరు చాలా కఠినమైన వ్యక్తి! గిల్ విషయంలో సన్నీపై హేడెన్‌ ఘాటు వ్యాఖ్యలు

Matthew Hayden says Sunil Gavaskar too harsh on Shubman Gill Injury: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఫామ్ లేమితో సతమవుతున్న కేఎల్ రాహుల్‌ స్థానంలో గిల్‌ ఆడుతున్నాడు. అంతకుముందు జరిగిన వన్డేలలో రాణించిన గిల్‌.. నాగపూర్, ఢిల్లీ టెస్టులలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇండోర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ 21 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

అంతకుముందు పేసర్ కామెరూన్ గ్రీన్‌ బౌలింగ్‌లో ఆడుతూ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడ్డాడు. నాన్‌స్ట్రైకింగ్‌లోకి వెళ్తూ డైవ్‌ చేయడంతో పొత్తి కడుపునకు పైభాగంలో గీచుకుపోయింది. స్వల్పంగా గాయపడ్డ గిల్.. వెంటనే వైద్య సాయం తీసుకొన్నాడు. ఆ ఓవర్లో మరో రెండు బంతులు ఉండగా ఈ ఘటన జరిగింది. ఇదే విషయంపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్‌ మధ్య వాడీవేడీగా సంభాషణ జరిగింది. ఈ క్రమంలోనే మీరు చాలా కఠినమైన వ్యక్తి అని సన్నీని హేడెన్‌ అన్నాడు. 

గాయం అనంతరం కామెంట్రీ బాక్స్‌లో సునీల్‌ గవాస్కర్ మాట్లాడుతూ... 'శుభ్‌మన్‌ గిల్‌ పరుగు తీసే క్రమంలో డైవ్‌ చేయడంతో గాయపడ్డాడు. అతడికి కాస్త రిపేర్‌ అవసరమైంది. మరో రెండు బంతులు వేస్తే ఆ ఓవర్‌ పూర్తవుతుంది. గిల్‌ అప్పుడు చికిత్స తీసుకుంటే బాగుండేది. గిల్‌ రెండు బంతులు వేచి చూస్తే బాగుండేది. బౌలర్‌ నాలుగు బాల్స్‌ వేసి హాట్‌గా ఉన్నాడు, ఆ సమయంలో బ్రేక్‌ ఇవ్వడం వల్ల విశ్రాంతి దొరికింది. గిల్‌ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నాడు కాబట్టి ఓ రెండు నిమిషాలు ఓపికగా ఉంటే బాగుండు. ఇలాంటివే కొన్నిసార్లు చాలా వ్యత్యాసం కనిపించేలా చేస్తాయి' అని అన్నాడు. 

మ్యాథ్యూ హేడెన్‌ మాట్లాడుతూ... 'సునీల్ గవాస్కర్.. మీరు చాలా కఠినమైన వ్యక్తిలా ఉన్నారు. గాయం బాగా నొప్పి కలిగిస్తుంది. చికిత్స తీసుకోకుంటే ఎలా?' అని ప్రశ్నించాడు. వెంటనే సన్నీ అందుకుని.. 'నొప్పి ఉంటుంది కానీ, దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇవన్నీ భరించాలి. గిల్ మరో రెండు బంతుల కోసం వేచి ఉంటే బాగుండేది. అతడు స్ట్రైకింగ్‌లో ఉంటే ఆ బాధను ఓర్చుకుంటూ ఆడటం కష్టం. కానీ గిల్‌ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నాడు కాబట్టి కాసేపు ఆగేందుకు అవకాశం ఉంది' అని వివరణ ఇచ్చాడు. 

Also Read: Jupiter Venus Conjunction 2023: 12 ఏళ్ల తర్వాత హోలీ రోజున గ్రహాల గొప్ప కలయిక.. ఈ రాశి వారు కొత్త ఇల్లు, కారు కొంటారు!  

Also Read: Holi 2023 Remedies: హోలీ రోజున ఈ పని తప్పక చేయండి.. ఏడాదంతా మీ ఇంట్లో శుఖసంతోషాలు! ఊహించని డబ్బు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News