IND vs AUS 3rd Test Highlights: ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్టమైన స్థానంలో నిలిచింది. విజయానికి కేవలం 76 పరుగుల దూరంలో నిలిచింది. చేతిలో 10 వికెట్లు ఉండడంతో ఆసీస్ గెలుపు చాలా ఈజీ. అయితే పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తుండడంతో అద్భుతం జరగొచ్చని అభిమానులు ఆశతో ఉన్నారు. నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు కష్టం కావడంతో టీమిండియా స్పిన్ ద్వయం చెలరేగుతారని నమ్మకంతో ఉన్నారు. 2004లో జరిగిన ఓ మ్యాచ్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత్ చేసిన పోరాటం గురించి పొగుడుతున్నారు.
2004లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు.. ఆ సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో 107 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కంగారూ జట్టు సులభంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే భారత స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు కేవలం 93 పరుగులకే కుప్పకూలి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. మురళీ కార్తీక్ 3 వికెట్లు తీయగా.. అనిల్ కుంబ్లే ఒక వికెట్ తీశాడు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడునేందుకు టీమిండియా బౌలర్లు చేసిన పోరాటం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుండిపోయింది. తొలి ఇన్నింగ్స్ కేవలం భారత్ 104 పరుగులకే కుప్పకూలగా.. అప్పటి జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అత్యధిక 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత కంగారూ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసి.. 99 రన్స్ భారీ ఆధిక్యాన్ని సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగైన బ్యాటింగ్ చేసిన భారత జట్టు 205 పరుగులకు ఆలౌట్ అయింది. వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో పాటు కెప్టెన్ ద్రవిడ్ 27, మహ్మద్ కైఫ్ 25 పరుగులతో రాణించారు. అనంతరం ఆసీస్‌ను 93 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు ప్రత్యర్థి ఆసీస్ జట్టే.. లక్ష్యంగా కూడా స్వల్పంగా ఉండటంతో హిస్టరీ రిపీట్ అవుతుందేమో అని టీమిండియా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
Also Read: Bank Employees Holidays: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండు వీక్లీఆఫ్‌లు..?
Also Read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి