భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా.. రోహిత్ శర్మ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?

IND vs AUS 3rd T20I, Rohit Sharma about Indian Team Death Bowling. ఆసియా కప్‌ 2022 నుంచి డెత్‌ ఓవర్ల సమస్య కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అంగీకరించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 26, 2022, 01:55 PM IST
  • మూడో టీ20లో విజయం
  • భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా
  • రోహిత్ శర్మ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?
భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా.. రోహిత్ శర్మ ఏం సమాధానం చెప్పాడో తెలుసా?

IND vs AUS 3rd T20I, Rohit Sharma about Indian Team Death Bowling: ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఫలితం తేల్చే చివరి టీ20లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటి సూపర్ విక్టరీ సాధించి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. అయితే రోహిత్ సేన బౌలింగ్ విభాగంలో రాణించినప్పటికీ.. డెత్‌ ఓవర్ల సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆసియా కప్‌ 2022 నుంచి డెత్‌ ఓవర్ల సమస్య కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అంగీకరించాడు. 

హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత జట్టు ఇంకా ఎక్కడైనా మెరుగుపడాలా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. చాలా అంశాలు ఉన్నాయి అని రోహిత్ ఆ ప్రశ్నకు బదులిచ్చాడు. ' భారత్ సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది. అయితే మెరుగుపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌. వచ్చే నెలలోనే కీలక టీ20 ప్రపంచకప్‌ 2022 ఉన్న నేపథ్యంలో ఇది పెద్ద ఆందోళన కలిగించే అంశంగా మరింది' అని రోహిత్ చెప్పాడు. 

'జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ చాలా కాలం తర్వాత భారత జట్టుకు ఆడుతున్నారు. ఆస్ట్రేలియా జట్టు ఎంత పటిష్టంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌కు బౌలింగ్‌ చేయడం కష్టమే. అందుకే నేను హర్షల్‌, బుమ్రా బౌలింగ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు విరామం తర్వాత వచ్చినందున కాస్త సమయం తీసుకుంటారు. వారు తిరిగి గాడిలో పడతారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం సాధించినందుకు సంతోషం. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉంది' అని రోహిత్‌ శర్మ చెప్పాడు. 

Also Read: కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్.. అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో

Also Read: IND vs AUS: రామ్ చరణ్ ఇంట్లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ సందడి.. హార్దిక్, సూర్య సహా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News