Rohit Sharma Run Out For Pujara: ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌గా ఉన్న ఆసీస్‌ను వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో చిత్తుచేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రవీంద్ర జడేజా 10 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ ఆరు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలగా.. 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో రెండో పరుగు కోసం యత్నించి.. రన్ ఔట్ అయ్యాడు. తన వికెట్‌ను వందో టెస్ట్ ఆడుతున్న పుజారా కోసం త్యాగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కేఎల్ రాహుల్ ఒక పరుగు చేసి ఔట్ అవ్వగా.. పిచ్ స్పిన్నర్లకు సహరిస్తోంది. దీంతో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాలని హిట్‌మ్యాన్ భావించాడు. లంచ్ తరువాత రెండో సెషన్ ఆట ప్రారంభమైన వెంటనే.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కేవలం 20 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అయితే కుహ్నెమాన్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడిన రోహిత్ ఒక పరుగు తీశాడు. రెండో పరుగు కోసం యత్నించగా.. ఫీల్డర్ కీపర్‌కు విసిరాడు. అప్పటికే పుజారా క్రీజ్ వదిలి నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు పరిగెత్తాడు. గమనించిన రోహిత్ శర్మ వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నా వెళ్లలేదు. పుజారా కోసం తన వికెట్ త్యాగం చేసి రనౌట్ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
Man has decided to get out himself for Pujara who is playing his 100th test match and also so that Virat get chance to score some runs for getting confidence for the next test.
My Captain ROHIT SHARMA ❤#RohitSharma pic.twitter.com/APZ6OmKuvj— Saurabh Yadav (@Saurabhkry08) February 19, 2023
పుజారాకు ఇది కెరీర్‌లో వందో టెస్ట్. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో గింగిరాలు తిప్పుతున్న ఆసీస్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 74 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. తన వందో టెస్ట్‌లో బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టి చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. రోహిత్ శర్మ తన వికెట్ త్యాగం చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మ్యాచ్ అనంతరం పుజారా మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ అని చెప్పాడు. దురదృష్టవశాత్తు తాను మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయలేకపోయానని అన్నాడు. తన 100వ టెస్టులో విన్నింగ్ రన్ చేయడం చాలా ప్రత్యేక అనుభూతి ఇచ్చిందన్నాడు. వచ్చే రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలని చూస్తున్నామన్నాడు.
Also Read: MLA Sayanna Passed Away: బిగ్ బ్రేకింగ్.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ
\స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి