Gavaskar On Rohit: రోహిత్‌ శర్మ చాలా బాగా బ్యాటింగ్‌ చేశాడు.. కానీ..: సునీల్‌ గవాస్కర్

IND vs AUS 2d T20I: Sunil Gavaskar impressed with Rohit Sharma's Nagpur knock. రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ స్పందించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 24, 2022, 02:23 PM IST
  • హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది
  • చాలా సెలెక్టివ్‌గా షాట్లు బాదాడు
  • 20 బంతుల్లో 43 నాటౌట్‌
Gavaskar On Rohit: రోహిత్‌ శర్మ చాలా బాగా బ్యాటింగ్‌ చేశాడు.. కానీ..: సునీల్‌ గవాస్కర్

IND vs AUS 2nd T20I, Sunil Gavaskar praise on Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ అద్భుత విజయం సాధించి.. 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వర్ష ప్రభావంతో మ్యాచ్‌ 8 ఓవర్లకు కుదించడంతో.. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి రోహిత్‌ శర్మ (46; 20 బంతుల్లో 4×4, 4×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ప్రస్తుతం రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ స్పందించారు. హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ తనని బాగా ఆకట్టుకుందని, సెలెక్టివ్‌గా షాట్లు బాదాడని కితాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌లో సన్నీ మాట్లాడుతూ... 'రోహిత్‌ శర్మ ఈరోజు ఆడిన విధానం చాలా బాగుంది. అతడు చాలా జాగ్రత్తగా ఆడాడు. అంతేకాదు చాలా సెలెక్టివ్‌గా షాట్లు బాదాడు. ఫ్లిక్ షాట్లు లేదా పుల్‌ షాట్లు రోహిత్ బాగా ఆడతాడు. ఈరోజు ఆడిన షాట్లు అన్ని చూడముచ్చటగా ఉన్నాయి' అని అన్నారు. 

'ఆఫ్‌సైడ్‌లో ఆడాలని చూసినప్పుడే రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. అక్కడే హిట్‌మ్యాన్‌ స్టాండ్స్‌లోకి కాకుండా.. గాల్లోకి బంతిని లేపుతున్నాడు. అప్పుడు పెవిలియన్ చేరాల్సి వస్తుంది. ఇదొక్క విషయంలోనే రోహిత్ జాగ్రత్తగా ఉండాలి. ఇది అధిగమిస్తే అతడిలో ఏ లోపం లేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు' సునీల్‌ గవాస్కర్ పేర్కొన్నారు. రోహిత్ ఇటీవలి కాలంలో మంచి ఫామ్ కనబర్చుతున్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి గేర్ మార్చుతున్నాడు. 

ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (2/13) ఆ జట్టును దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరలో మాథ్యూ వేడ్‌ (20 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా మరో నాలుగు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానంలో జరగనుంది. 

Also Read: Amala Paul Hot Pics: అమలా పాల్ హాట్ ట్రీట్.. పొట్టి డ్రెస్సులో అంతా కనబడేలా స్టిల్స్!  

Also Read: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. కన్నీటి పర్యంతమయిన ఫెదరర్‌, నాదల్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News