IND vs AFG Highlights: రోహిత్ మెరుపు సెంచరీ.. అఫ్గాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..

ODI WC 2023: ప్రపంచకప్ లో టీమిండియా తన జైతయాత్రను కొనసాగిస్తోంది. భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‍తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2023, 09:28 PM IST
  • రోహిత్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ
  • అప్ఘాన్ పై టీమిండియా ఘన విజయం
  • పలు రికార్డులను నెలకొల్పిన హిట్ మ్యాన్
IND vs AFG Highlights:  రోహిత్ మెరుపు సెంచరీ.. అఫ్గాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..

India vs Afghanistan Match Highlights:  వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తన రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో(131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. దీంతో అతడికి ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టీమిండియా తన తర్వాత మ్యాచ్ ను దాయాది పాకిస్థాన్ తో అక్టోబరు 14న ఆడబోతుంది. ఈ మ్యాచ్ ఆహ్మదాబాద్ వేదికగా జరగనుంది. 

తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 80 పరుగులు, ఓమర్జాయ్ 62 పరుగులతో రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ ఆఫ్గాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మైదానం నలుమూలల సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. శతకాన్ని మరో 33 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. మరో ఎండలో ఇషాన్ కిషాన్ మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ ఔటైనా శ్రేయస్ తో కలిసి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు కోహ్లీ. కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది భారత్. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశాడు.

Also Read: IND vs AFG Live: ఒకే మ్యాచ్.. మూడు ప్రపంచ రికార్డులు.. అది హిట్ మ్యాన్ అంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News