IND Playing 11 vs SA: సిరాజ్ ఇన్.. పంత్ డౌట్! దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే

India vs South Africa 2nd T20 probable playing 11. రెండో టీ20 కి మొహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 2, 2022, 01:02 PM IST
  • సిరాజ్ ఇన్.. పంత్ డౌట్
  • దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే
  • ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకుంటుందా?
IND Playing 11 vs SA: సిరాజ్ ఇన్.. పంత్ డౌట్! దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే

IND Playing 11 vs SA 2nd T20: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఆదివారం గువాహటిలో రెండో టీ20 ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో.. మరోసారి పేస్‌ బౌలింగ్‌కు పరీక్ష తప్పదు. బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

టీమిండియా బ్యాటింగ్ గురించి ఎలాంటి సందేహాలు లేవు. అందరూ మంచి ఫామ్ కనబర్చుతున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అదరగొడుతున్నారు. దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా సత్తా చాటుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా ఈ ఐదుగురు జట్టులో ఉండడం ఖాయం. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గత మ్యాచులలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆడాడు. ఇప్పుడు మొహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో భారత్ ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. 

నాలుగో పేసర్ కావాలనుకుంటే మాత్రం మొహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో అక్షర్ పటేల్ ఆడతాడు. స్పెసలిస్ట్ స్పిన్ కోటాలో ఆర్ అశ్విన్ బరిలోకి దిగుతాడు. పొట్టి మెగా టోర్నీలో చోటు దక్కించుకున్న అర్ష్‌దీప్ సింగ్‌, హర్షల్ పటేల్‌లతో పాటు స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ ఆడనున్నాడు. 

భారత్ తుది జట్టు (అంచనా): 
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, మహమ్మద్ సిరాజ్/రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్, ఆర్ అశ్విన్. 

Also Read: ఆవారా జిందగీ అంటోన్న బిగ్ బాస్ శ్రీహాన్

Also Read: FOOTBALL FANS FIGHT: రక్తపాతంగా మారిన ఫ్యాన్స్ ఫైట్.. 129 మందిని బలి తీసుకున్న ఫుట్ బాల్ మ్యాచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News