ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ లక్నో మ్యాచ్ ఇటు టీమ్ ఇండియాకు అటు ఇంగ్లండ్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఖాయమౌతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ ఆశలు కాస్తైనా మిగిలుండవచ్చు. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది పరిశీలిద్దాం..
ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా విజయయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా ఆరవ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో టీమ్ ఇండియాను ఓడించి సెమీస్ ఆశలు పూర్తిగా కోల్పోకుండా కోలుకునేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించనుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే ఇక ఇంగ్లండ్ ఇంటికి వెళ్లడం ఖాయం. వరుస ఓటములతో ఉన్న ఇంగ్లండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ జట్టులో లోపించింది ఫామ్ మాత్రమే. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఇప్పటికీ ఉంది. ఒకసారి ఫామ్ తెచ్చుకుంటే ఆ జట్టు ఇండియాకు గట్టి పోటీ ఇవ్వగలదు.
20 ఏళ్లుగా ఇండియాకు దక్కని విజయం
ప్రపంచకప్ మ్యాచ్‌లలో రెండు జట్ల చరిత్ర చూస్తే గత 20 ఏళ్లుగా ఇండియా ఇంగ్లండ్‌పై విజయం సాధించలేదు. 20 ఏళ్ల తరువాత ఇప్పుడైనా ఇంగ్లండ్‌పై విజయం సాధించేందుకు ఇండియా గట్టి ప్రయత్నమే చేయనుంది. 2003 ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఇండియా చివరిసారిగా ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఆ తరువాత 2007,2011,2015, 2019 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓటమి ఎదుర్కొంది. ప్రపంచకప్ విజయాల్ని ఇంగ్లండ్ కొనసాగిస్తుందో లేదా ఇండియా దానికి బ్రేక్ వేస్తుందో చూడాలి.
ఓవరాల్‌గా ఇండియాదే ఆధిపత్యం
ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఇప్పటి వరకూ 106 వన్డేలు జరిగాయి. ఇందులో ఇండియా 57 గెలిస్తే ఇంగ్లండ్ 44 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 3 మ్యాచ్ ఫలితం లేకుండా, 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొట్ట మొదటి మ్యాచ్ 1974 జూలై 13న జరిగింది. చివరి మ్యాచ్ 2022 జూలై 17న జరిగింది.
టీమ్ ఇండియా అంచనా జట్టు
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్ లేదా రవిచంద్రన్ అశ్విన్
ఇంగ్లండ్ జట్టు
బట్లర్, బెయిర్ స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్ స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్
Also read: NED Vs BAN Highlights: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా చిత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook