Ind vs Aus Final: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫలితం ఎవరూ ఊహించనిది. ఈ ప్రపంచకప్‌లో ఒక్క పరాజయం లేకుండా, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమ్ ఇండియా ఓటమి ఊహించని పరిణామం. ఎందుకీ పరిస్థితి, అంతవరకూ అద్భుతంగా రాణించిన జట్టు ఒక్కసారిగా ఇలా ఎందుకు బోల్తా పడిందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచకప్ 2023 కప్ ఆస్ట్రేలియా ఆరవసారి ఎగరేసుకుపోయింది. మూడోసారి కప్ సాధించాలన్న టీమ్ ఇండియా కల చెదిరిపోయింది. కేవలం 241 పరుగుల లక్ష్యాన్ని ఛేధించేందుకు ఆస్ట్రేలియకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. మరో 7 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్టు టీమ్ ఇండియా ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కారణాలేంటో ఓ సారి పరిశీలిద్దాం..
టాస్ ఆస్ట్రేలియా గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పజెప్పినప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా ఆడే అవకాశమున్నా ఒత్తిడికి గురైంది. స్వదేశంలో లక్షలాది ప్రేక్షకుల మద్దతును ప్రోత్సాహంగా తీసుకోలేక ఒత్తిడిగా భావించింది. రోహిత్ శర్మ ఆరంభంలో దూకుడుగా ఆడినా..ఫైనల్ అన్న లాజిక్ మర్చిపోయి అనవసర హిట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఆ తరువాత శుభమన్ గిల్ చెత్త షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిపోయాడు. తరువాత బరిలో దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చాలా సేపు బరిలో నిలదొక్కుకుని స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి విపలమయ్యాడు.
ఇక ఇండియా విధించిన 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించేందుకు ఆస్ట్రేలియా బరిలో దిగింది. ప్రారంభంలో మూడు వికెట్లను 45 పరుగుల్లోపే పడగొట్టి కప్ ఇండియా సాధిస్తుందనే ఆశలు రేపింది. అయితే ఆ తరువాత హెడ్, లాబుస్ షాగ్నే జోడీని విడగొట్టడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. టీమ్ ఇండియా బౌలర్లు, బ్యాటర్లు ఫైనల్లో విఫలం కావడం ఓ కారణమైతే..అత్యంత దారుణమైన ఫీల్డింగ్ మరో కారణం.
ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌తో పోలిస్తే ఇండియా ఫీల్డింగ్ తేలిపోయింది. బంతికి ఎదురెళ్లి పట్టుకునేందుకు ఆస్ట్రేలియన్లు చూపించిన తెగువ ఇండియా ఆటగాళ్లలో లేకపోయింది. బంతి తనవరకూ వచ్చేవరకూ నిరీక్షించడమే ఇండియాకు అలవాటుగా మారింది. ఫలితంగా చాలా పరుగులు ధారాళంగా కోల్పోవల్సి వచ్చింది. రనౌట్లు చేసే అవకాశం కోల్పోయారు.
Also read: Team india Emotion: ఓటమితో టీమ్ ఇండియా ఆవేదన, కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సిరాజ్, రోహిత్, కోహ్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook