Rishith Reddy got place in Indian U19 Team: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ (Under 19 World Cup 2022) 2022లో హైదరాబాద్ యువ ఆటగాడు రిషిత్ రెడ్డి (Rishith Reddy) రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. దాంతో అతడికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు (జనవరి 20) భారత (India U19 Team) కెప్టెన్ యష్ ధుల్, వైఎస్ కెప్టెన్ షేక్ రషీద్ సహా ఆరుగురు ప్లేయర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్.. ఐర్లాండ్‌పై ఘన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
అండర్-19 ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ఐదుగురు ఆటగాళ్లను రిజర్వ్‌గా ఎంపిక చేసింది. ఈ జాబితాలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డి (Rishith Reddy Reserve player) కూడా ఉన్నాడు. రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారణ్ (రాజస్థాన్), అభిషేక్ పోరెల్ (బెంగాల్), అన్ష్ గోసాయి (సౌరాష్ట్ర), పుష్పేంద్రసింగ్ రాథోడ్ (రాజస్థాన్)లు అండర్-19 ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు.
శనివారం (జనవరి 22) వెస్టిండీస్‌కు బయల్దేరి వెళ్లనున్న భారత రిజర్వ్ ఆటగాళ్లు అందరూ ఆరు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆపై కరోనా టెస్టుల్లో నెగటివ్ వస్తే.. భారత యువ జట్టుతో కలుస్తారు. క్వార్టర్ ఫైనల్ సమయానికి వీరందరూ జట్టులో చేరునున్నారు. మెగా టోర్నీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శనివారం పసికూన ఉగాండాతో భారత్ తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా..చివరి మ్యాచ్‌లోనూ సత్తాచాటాలని చూస్తున్నది.
Also Read: Andre Russell Run Out: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రనౌట్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rishith Reddy Indian Team: హైదరాబాద్ ఆటగాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాలో చోటు!!
హైదరాబాద్ ఆటగాడికి బంపర్ ఆఫర్
హైదరాబాద్ ఆటగాడికి టీమిండియాలో చోటు
రిజర్వ్ ప్లేయర్‌గా రిషిత్ రెడ్డి