ICC Bans UAE Cricketers: క్రికెట్‌లో పొరపాటున జరిగే తప్పిదాలకు సైతం ఆటగాళ్లు మూల్యం చల్లించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) రూపొందించిన నియమావళిని ఆటగాళ్లు పాటిస్తారు. అయితే ఇద్దరు క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ వేటు వేసింది. 8 ఏళ్లపాటు నిషేధం విధించింది. 2019 ప్రపంచ కప్ అర్హత సాధించే మ్యాచ్‌లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) క్రికెటర్లు మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్‌లకు కొందరు మ్యాచ్ ఫిక్సర్ల నుంచి కాల్స్ రావడంతో భయపడి వారు చెప్పినట్లు చేశారు. గతంలో ప్రాథమికంగా వీరిద్దరు తప్పుచేశారని గుర్తించడంతో తాత్కాలిక నిషేధం విధించారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అన్ని వివరాలు పరిశీలించిన ఐసీసీ మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్‌లను 8 ఏళ్లపాటు క్రికెట్ ఆటకుండా నిషేధం విధిస్తూ ICC కఠిన నిర్ణయం తీసుకుంది.
Also Read: Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ
2019 అక్టోబర్ 16 నుంచి వీరికి ఈ శిక్ష అమలులోకి రానుంది. మహ్మద్ నవీన్ రైట్ హ్యాండ్ పేస్ బౌలర్. అతడు యూఏఈకి వన్డేలు, టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. 39 వన్డేలు, 31 టీ20లు ఆడిన నవీద్ ఫిక్సింగ్(Match Fixing)కు పాల్పడ్డాడు. షైమన్ అన్వర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా యూఏఈ జట్టుకు సేవలు అందించాడు. మ్యాచ్ ఫిక్సర్ల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో వారి మాటలు పాటించి, అభిమానులు, జాతీయ జట్టును మోసం చేశారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook