క్రిస్ గేల్‌కు షాక్ ఇచ్చిన సర్ఫరాజ్

ఇటీవలే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఐపీఎల్‌లో ఆడబోయే తమ జట్టులో పలువురి పేర్లను ప్రకటించింది. 

Last Updated : Jan 5, 2018, 01:13 PM IST
క్రిస్ గేల్‌కు షాక్ ఇచ్చిన సర్ఫరాజ్

ఇటీవలే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఐపీఎల్‌లో ఆడబోయే తమ జట్టులో పలువురి పేర్లను ప్రకటించింది. అందులో విరాట్ కోహ్లీ, డివీలియర్స్ పేర్ల తర్వాత మరో దిగ్గజ బ్యాట్స్‌మన్ పేరును కూడా టీమ్ ప్రకటిస్తుందని అందరూ భావించారు. బహుశా క్రిస్ గేల్ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అన్ని అంచనాలను తారుమారు చేస్తూ ప్రస్తుతం మనదేశంలో దేశవాళీ క్రికెట్‌లో దుమ్ము లేపుతున్న కుర్రాడి పేరును ప్రకటించి రాయల్ ఛాలెంజర్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఆ కుర్రాడే సర్ఫరాజ్ ఖాన్. అయితే తనను ఆర్‌సీ ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనే విషయాన్ని మాత్రం సర్ఫరాజ్ బహిర్గతం చేయలేదు. డబ్బు కన్నా విరాట్ కోహ్లీతో కలిసి తాను ఆడడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు అతను. దాదాపు రూ.1.75 కోట్లకు సర్ఫరాజ్‌ని ఆర్‌సీ జట్టు సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. 

Trending News