I don not have a money tree in my house says Gautam Gambhir: తాను ఢిల్లీలో 5 వేల మందికి భోజనాలు పెడుతున్నానని, అందుకోసం నెలకు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని భారత మాజీ ఓపెనర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు. తమ ఇంట్లో పైసల్ కాచే చెట్టు లేదని, అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పని చేస్తున్నానని ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. డబ్బుల కోసం ఐపీఎల్లో పని చేస్తున్నాడంటూ తనపై చేసిన విమర్శకులకు గౌతీ ఇలా కౌంటర్ ఇచ్చారు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్.. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఓ వైపు ఎంపీగా ఉంటూనే.. మరోవైపు ఐపీఎల్లో ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా సేవలందించారు. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టీం ప్లే ఆఫ్స్ చేరింది. అయితే కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఎంపీగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయకుండా.. డబ్బుల కోసం ఐపీఎల్లో పని చేస్తున్నాడని గౌతమ్ గంభీర్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై తాజాగా గౌతీ తనదైన శైలిలో స్పందించారు. 'నేను ఐపీఎల్లో పని చేయడానికి బలమైన కారణం ఉంది. ఢిల్లీలో నేను 5 వేల మందికి భోజనాలు పెడుతున్నా. అందుకోసం నెలకి రూ. 25 లక్షలు ఖర్చు అవుతోంది. ఏడాదికి రూ. 2.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మరో రూ. 25 లక్షలు పెట్టి లైబ్రరీ కట్టించాను. ఎంపీ ల్యాడ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు' అని గంభీర్ తెలిపారు.
ఎంపీ ల్యాడ్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులతో మాకు వంట సామాను కూడా రాదు. వీటన్నింటికీ ఖర్చు పెట్టడానికి మా ఇంట్లో పైసల్ కాచే చెట్టు లేదు. అందుకే ఐపీఎల్లో పనిచేస్తున్నా. నేను పని చేయడం వల్లనే ఆ 5000 మందికి భోజనం పెట్టగలుగుతున్నా.. లైబ్రరీని స్థాపించగలిగాను. నేను ఐపీఎల్లో కామెంటరీ చేయడానికి, మెంటార్‌గా ఉండడానికి ఉన్నానని చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు' అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చారు. గంభీర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు.
Also Read: Purandeswari on Alliance: జనసేనతో పొత్తుపై బీజేపీ నేత పురందేశ్వరి ఎమన్నారంటే..?
Also Read: Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook