IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

How Much Prize Money IPL Winner Will Get | క్రికెట్ అభిమానులను గత 50 రోజుల నుంచి అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( IPL2020 ) ఫైనల్ నేడు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. 

Last Updated : Nov 10, 2020, 02:23 PM IST
    1. క్రికెట్ అభిమానులను గత 50 రోజుల నుంచి అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఫైనల్ నేడు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
    2. ఇక విన్నింగ్ టీమ్, రన్నరప్ టీమ్ కు ఎంత డబ్బు అందుతుందో చూద్దాం.
IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

IPL 2020 Winning Team Prize Money | క్రికెట్ అభిమానులను గత 50 రోజుల నుంచి అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (IPL 2020) ఫైనల్ నేడు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ), ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) మధ్య నేడు తుది సమరం జరగనుంది. ఇక విన్నింగ్ టీమ్, రన్నరప్ టీమ్ కు ఎంత డబ్బు అందుతుందో చూద్దాం.

ఐపీఎల్ 2019 ప్రైజ్ మనీ...
గత సంవత్సరం 2019లో జరిగిన ఐపీఎల్ 12వ ( IPL Season 12 ) సీజన్ లో మొత్తం ప్రైజ్ మనీ రూ. 32.5 కోట్లు. వీటిని విజేతగా నిలిచిన టీమ్, రన్నరప్ టీమ్ కు అందించారు. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా వారు మొత్తం రూ.20 కోట్లను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో రన్నరప్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్  (CSK ) రూ.12.5 కోట్లను గెలుచుకుంది.

ఐపీఎల్ 2020 ప్రైజ్ మనీ..
కానీ ఈ సంవత్సరం పరిస్థితి మారింది. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రేక్షకులకు దూరంగా, ఐపీఎల్ పురిటిగడ్డ అయిన భారత్ నుంచి దూరంగా ఈ లీగ్ యూఏఈలో నిర్వహించారు. అందుకే ఈసారి విజేతలకు కూడా 2019లో వచ్చేంత డబ్బు ఇచ్చే అవకాశం లేదు. ఈ మేరకు ఇండియన్ క్రికెట్ బోర్డు ఎప్పుడో ఒక ప్రకటన చేసింది. విజేతలు అయినా, రన్నరప్ అయినా వారికి గత సంవత్సరంతో పోల్చితే సగం మొత్తం మాత్రమే ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు సమాచారం. 

ఈ లెక్కన చూస్తే విజేతగా నిలిచే టీమ్ రూ.10 కోట్లు రానున్నాయి. రన్నరప్ టీమ్ సుమారు రూ.6 కోట్లు సొంతం చేసుకోనున్నారు. అయితే ఐపీఎల్ 2020 విజేత ఎవరు,  ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 రన్నరప్ ఎవరు అనేది ఇవాళ తేలిపోనుంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News