Hockey World Cup 2023 : నరాలు తెగే ఉత్కంఠ... డ్రాగా ముగిసిన భారత్‌-ఇంగ్లాండ్ మ్యాచ్..

Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్‌లో భాగంగా..భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరు అడుగుపెడతారనేది ఉత్కంఠగా మారింది  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 09:35 AM IST
Hockey World Cup 2023 : నరాలు తెగే ఉత్కంఠ... డ్రాగా ముగిసిన భారత్‌-ఇంగ్లాండ్ మ్యాచ్..

Hockey World Cup 2023, India vs England: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా... ఆదివారం జరిగిన గ్రూప్ డి మ్యాచ్ లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన గోల్ కొట్టలేకపోయాయి. బిర్సాముండా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, ఇంగ్లండ్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు లభించాయి, అయినా సరే రెండు టీమ్ లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం పూల్ డీలో ఇంగ్లాండ్ మెుదటి స్థానంలో, టీమిండియా రెండో స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌కు ఎవరు వెళతారనేది ఉత్కంఠగా మారింది. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..
తొలి క్వార్టర్ లో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం ట్రై చేసినప్పటికీ దానిని గోల్ గా మలచడంలో విఫలమయ్యాడు. ఇంగ్లీష్ జట్టుకు అనేక సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో అర్థభాగంలో టీమిండియాకు పెనాల్టీ గోల్ వేసే అవకాశం వచ్చినా దానిని తృటిలో చేజార్చుకుంది. ఇంగ్లాండ్ గోల్ కీపర్ అద్భుతమైన ఢిపెన్స్ కారణంగా మూడో క్వార్టర్ లో భారత్ గోల్ చేయలేకపోయింది.  ఆట ముగిసే సమయానికి ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యా చ్ అవార్డు లభించింది. ఇక ఇదే గ్రూప్ లో జరిగిన మరో పోరులో స్పెయిన్ 5 - 1 గోల్స్ తేడాతో వేల్స్ పై గెలుపొందింది. 

Also Read: 508 Not out in 178 Balls: 178 బంతుల్లో 508 పరుగులతో నాటౌట్.. 13 ఏళ్ల బుడతడి సరికొత్త నేషనల్ రికార్డ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News