/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Hijab Controversy: ప్రస్తుతం దేశంలో చెలరేగుతోన్న హిజాబ్ వివాదంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా స్పందించారు. హిజాబ్ ధరించిన బాలికలను స్కూల్ గేట్ బయటే నిలిపివేసే వీడియో ఇటీవలే వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన గుత్తా జ్వాలా.. ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

"బాలికలను పాఠశాల గేట్ వద్ద అవమానించడం మానుకోండి. వారు తమ కాళ్లపై తాము ఎదిగేందుకు వచ్చారు. చిన్న హృదయాలను అవమానించి బాధించడం మానుకోండి" అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్ చేశారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హిజాబ్ వివాదం ఏమిటి?

కర్ణాటకలో ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఈ హిజాబ్ వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇది దేశంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు విస్తరించింది. ఇదే విషయమై విద్యాసంస్థలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించి.. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె స్పష్టం చేశారు. ఆ తర్వాత హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన కోర్టు.. హిజాబ్ ధరించి వచ్చిన వారికి విద్యాసంస్థల్లో ప్రవేశం లేదని కోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పుకు అనుగుణంగా మాండ్యాలోని రోటరీ స్కూల్ కు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను యాజమాన్యం అనుమతించలేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి.  

Also Read: Hijab Row: హిజాబ్ లేకపోవడం వల్లనే దేశంలో అత్యాచారాలు

Also Read: Hijab row: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం- అల్లర్లు సృష్టించే వారికి సీఎం వార్నింగ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hijab Controversy: Badminton player Gutta Jwala responded on hijab controversy in the country
News Source: 
Home Title: 

Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్ 

Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్
Caption: 
Hijab Controversy: Badminton player Gutta Jwala responded on hijab controversy in the country | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • హిజాబ్ వివాదంపై షట్లర్ గుత్తా జ్వాలా స్పందన
  • స్కూల్ బయటే బాలికలను ఆపేయడంపై ఆగ్రహం
  • బాలికలను అవమానించవద్దని హితవు
Mobile Title: 
Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కామెంట్స్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 15, 2022 - 12:44
Request Count: 
99
Is Breaking News: 
No