KGF Chapter 2: కథలో కీలకమైన విషయాన్ని చెప్పిన యష్.. అసలు స్టోరీ రివీల్!

Yash about KGF Chapter 2 Story. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ చాప్టర్‌ 2లోనే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని, ఇది తల్లీకొడుకుల సినిమా అని కన్నడ స్టార్ హీరో యష్ తెలిపాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 12:46 PM IST
  • ఏప్రిల్ 14న కేజీయఫ్‌ 2 విడుదల
  • కథలో కీలకమైన విషయాన్ని చెప్పిన యష్
  • కేజీయఫ్‌ చాప్టర్‌ 2 అసలు స్టోరీ రివీల్
KGF Chapter 2: కథలో కీలకమైన విషయాన్ని చెప్పిన యష్.. అసలు స్టోరీ రివీల్!

Hero Yash reveals KGF Chapter 2 Story in Tirupati press meet: ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్‌ 2'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ శాండల్‌వుడ్ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల అవుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

స్వామివారి దర్శన అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కేజీఎఫ్ హీరో యష్.. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. కేజీఎఫ్ చాప్టర్‌ 2 స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కేజీఎఫ్ 1, 2 పార్టులకు చాలా తేడా ఏంటని అడగ్గా.. కథలోనే పెద్ద డిఫరెన్స్, ఎలివేషన్ ఉందన్నారు. పార్ట్ 1లో మదర్ సెంటిమెంట్ ఉంది కదా?, పార్ట్ 2లో కూడా ఉంటుందా అని అడిగితే.. 'పార్ట్ 2లోనే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లీకొడుకుల సినిమా. సినిమాలో అదే మెయిన్ ఎమోషన్' అని రాఖీ భాయ్ బదులిచ్చాడు. 

బాహుబలి కలెక్షన్లను కేజీఎఫ్ చాప్టర్‌ 2 బ్రేక్ చేస్తుందా ? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. 'ఒక సినిమా రిలీజ్ అయితే అంతకుముందున్న రికార్డులను బ్రేక్ చేయాలి. దాన్ని ప్రోగ్రెస్ అంటారు. ఎదో ఒక రికార్డు క్రియేట్ అయ్యిందంటే దాన్నే పట్టుకుని కూర్చోవద్దు. కలెక్షన్లు, రికార్డులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అయితే ప్రేక్షకుల ప్రేమ ఎంత ఉంది? అనేదే చాలా ముఖ్యం. ఆ దేవుడు ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. ఏది చేయాలన్నా.. ప్రేక్షకుల చేతిలోనే ఉంది' అని కన్నడ స్టార్ హీరో యష్ పేర్కొన్నారు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ చాప్టర్‌ 2' సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్.. టాలీవుడ్ సీనియర్లు ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో కేజీఎఫ్ నటీనటులు బిజీగా ఉన్నారు. 

Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్‌ అశ్విన్‌ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

Also Read: SBI ATM New Rules: ఎస్బీఐ ఎటీఎంలలో కొత్త నిబంధన, డబ్బులు తీయాలంటే ఓటీపీ తప్పనిసరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News