ఆండ్రూ సైమండ్స్‌‌కి చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చిన హర్భజన్ సింగ్ !

ఆండ్రూ సైమండ్స్‌‌కి చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చిన హర్భజన్ సింగ్ !

Last Updated : Dec 16, 2018, 07:26 PM IST
ఆండ్రూ సైమండ్స్‌‌కి చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చిన హర్భజన్ సింగ్ !

సరిగ్గా పదేళ్ల తర్వాత మరోసారి తనను కెళుకున్న ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌కి చెంప ఛెళ్లుమనిపించే విధంగా ఘాటైన రిప్లై ఇచ్చాడు హర్భజన్ సింగ్. ''2008లో మంకీగేట్ వివాదంలో హర్భజన్ సింగ్ తనకు క్షమాపణ చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడు'' అని వ్యాఖ్యానించి మానిన పాత గాయాన్నిరేపిన ఆండ్రూ సైమండ్స్‌కి హర్భజన్ సింగ్ అంతే ఘాటైన రిప్లై ఇచ్చాడు. మమూలుగానే ఏ అంశంపైనైనా తనదైన స్టైల్లో ఛమత్కారంతో స్పందించే స్వభావం వున్న హర్భజన్ సింగ్.. తననే కెళికిన ఆండ్రూని మాత్రం అంత ఈజీగా విడిచిపెడతాడా చెప్పండి!! అందుకే ట్విటర్ ద్వారా ఆండ్రూ కామెంట్‌పై స్పందించిన బజ్జీ... "అప్పట్లో(2008)లో ఓ కథ చెప్పి తప్పించుకున్నావు... ఇప్పుడు(2018) మరో కథ చెబుతున్నావు" అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. "గడిచిన పదేళ్లలో ప్రపంచం ఎంతో ఎదిగింది.. నువ్వు మాత్రం ఎదగలేదు. నువ్వు ఇంకా ఎదగాలి" అనే అర్ధం వచ్చేలా బజ్జీ ఓ సెటైర్ వేశాడు. తనను రెచ్చగొట్టిన సైమండ్స్‌పై బజ్జీ వేసిన సెటైర్ మరోసారి అతడిలోని చమత్కారాన్ని బయటపెట్టింది.

 

Trending News