టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ట్విట్టర్లో స్పందించాడు. ఐసీసీ తీరుపట్ల విరుచుకుపడ్డారు. అన్ని సాక్ష్యాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం విధించకపోవడాన్ని పూర్తిగా తప్పుబట్టారు. 2001లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా టీమిండియాలో ఆరుగురికి ఒక్కో మ్యాచ్ నిషేధం విధించారు.. నన్నూ 2008 సిడ్నీ మ్యాచ్ లో మూడు మ్యాచులు ఆడకుండా చేశారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో శిక్షలా? అంటూ ఐసీసీపై మండిపడ్డారు.
ట్విట్టర్లో హర్భజన్ సింగ్ ఏమన్నారంటే- 'ఆహా ఐసీసీ! ఎంత గొప్ప తీర్పో? బాల్ ట్యాంపరింగ్ వివాదంలో మీ నిర్ణయం పూర్తిగా వివక్ష పూరితం. అన్ని ఆధారాలు ఉన్నా బాన్‌క్రాఫ్ట్‌పై ఎలాంటి సస్పెన్షన్ లేదు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతిగా అప్పీల్ చేసినందుకు ఆరుగురుపై (సచిన్, సౌరవ్, శివసుందర్, దీప్‌దాస్ గుప్తా, సెహ్వాగ్)పై ఒక్కో టెస్ట్ సస్పెన్షన్ వేశారు. 2008 సిడ్నీ టెస్టు సందర్భంగా నా తప్పేమీ లేకున్నా 3 మ్యాచ్‌లు నిషేధించారు. కానీ అన్ని సాక్ష్యాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు శిక్షలా. ఆస్ట్రేలియా జట్టు మొత్తాన్ని శిక్షించాలి' అని అన్నాడు.
wow @ICC wow. Great treatment nd FairPlay. No ban for Bancroft with all the evidences whereas 6 of us were banned for excessive appealing in South Africa 2001 without any evidence and Remember Sydney 2008? Not found guilty and banned for 3 matches.different people different rules
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 25, 2018
2001లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో తనను మోసగాడిగా పేర్కొనడం బాధించిందని, తాను ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు రిఫరీ మైక్ డెన్నిస్ నిర్ధారించడం ఎంతగానో కలచివేసిందనని.. తన కెరీర్లో ఎదురైన క్లిష్ట సమయాలను గురించి ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో సచిన్ వివరించిన సంగతి తెలిసిందే..!